Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశి మధనం సూపర్ సక్సెస్ ఆనందాన్ని ఇచ్చిందన్న టీమ్

డీవీ
శనివారం, 13 జులై 2024 (19:54 IST)
Shashi Madhanam team
సోనియా సింగ్, పవన్ సిద్దు లీడ్ రోల్స్ లో వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందిన వెబ్ సిరిస్ శశి మధనం. హరీష్ కోహిర్కర్ నిర్మించారు. ఇటివలే ఈటీవీ విన్ లో రిలీజైన ఈ వెబ్ సిరిస్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
 
హీరోయిన్ సోనియా సింగ్ మాట్లాడుతూ.. నా టీవీ కెరీర్ ఈటీవీ తో మొదలైయింది. మళ్ళీ ఓటీటీలో ఈటీవీ విన్ లో చేయడం చాలా ఆనందంగా వుంది. శశి మధనంను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్. ఆడియన్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకొని మరీ చూడటం చాలా ఆనందంగా వుంది. హరీష్ అన్న లేకపొతే ఈ ప్రాజెక్ట్ వుండేది కాదు. అలాగే నితిన్, సాయి అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు. వినోద్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చారు. పవన్ తో పాటు ఈ సిరిస్ లో పని చేసిన అందరికీ థాంక్స్. మా అందరినీ ప్రోత్సహించిన ఈటీవీ విన్ కి థాంక్స్' చెప్పారు. 
 
హీరో పవన్ సిద్దు మాట్లాడుతూ.. నిర్మాత హరీష్ అన్న, నితిన్, సాయి అన్న థాంక్స్. శశి మధనం సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. డైరెక్టర్ వినోద్ అద్భుతంగా తీశారు. అలాగే టీంలో అందరూ ది బెస్ట్ ఇచ్చారు. ఈటీవీ విన్ కి కృతజ్ఞతలు. మా నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్ కి మీ సపోర్ట్ కావాలి. సోనియా వుంది కాబట్టే నేను ఇంకాస్త ఫ్రీగా ఎఫర్ట్స్ పెట్టగాలిగాను. మిగిలిన ప్రాజెక్ట్స్ కి కూడా సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ సో మచ్' అన్నారు 
 
డైరెక్టర్ వినోద్ గాలి మాట్లాడుతూ.. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. మా నిర్మాత హరీష్ గారికి థాంక్స్. మొదటి నుంచి బలంగా నమ్మారు. నితిన్, సాయి అన్న థాంక్స్. మ్యూజిక్, డీవోపీ, ప్రొడక్షన్ డిజైనర్ ఇలా అందరూ అద్భుతంగా పని చేశారు. నటీనటులంతా చాలా సపోర్ట్ చేశారు. సిద్దు సోనియా చాలా కోపరేట్ చేశారు. ఈటీవీ విన్, అందరికీ థాంక్స్. ఈ సక్సెస్ ని రామోజీ రావు గారికి అంకితం ఇస్తున్నాం' అన్నారు. 
 
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ.. శశి మధనం సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. గత నెలలో రామోజీరావు గారు స్వర్గస్తులైనప్పుడు, మేము అంతా దిగులుగా వున్నప్పుడు మాకొచ్చిన సక్సెస్ శశి మధనం. వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ. శశి మధనం మంచి ఎంగేజింగ్ కంటెంట్ అని నమ్మాం. మా నమ్మకం నిజమైయింది. సబ్ స్క్రిప్ప్షన్స్ వస్తున్నాయి. మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తొలి నెలలోనే రికవరీ అయ్యింది. సీజన్ 2 వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. బాపనీడు గారికి, ఈటీవీ మ్యానేజ్మెంట్ కి థాంక్ యూ. ఈటీవీ విన్ నుంచి చాలా అద్భుతమైన కంటెంట్ రాబోతోంది. శశి మధనం టీం అందరికీ పేరుపేరునా థాంక్స్' చెప్పారు.   
 
ఈటీవీ విన్ సాయికృష్ణ మాట్లాడుతూ.. శశి మధనం సక్సెస్ మీట్ ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. డైరెక్టర్ వినోద్, నటీనటులు అందరికీ థాంక్ యూ. సోనియా, సిద్దు సిరిస్ ని చాలా క్యూట్ గా మార్చేశారు. మా ద్రుష్టిలో కథ కథనాలే హీరో. కథ కథనాలే సెన్సేషనల్ కాంబినేషన్. రామోజీరావు గారి నేర్పిన విలువలు పాటిస్తూ ఆయన బాటలో నడుస్తాం. తెలుగుదనం ఒట్టిపడే కథలు చెప్పాలనేది మా ప్రయత్నం. ఏడాదిలో 16 సినిమాలు నాలుగు వెబ్ సిరిస్ లు చేస్తున్నాం. ఈ ఇరవైమంది కొత్త దర్శకులే. ఎంతోమంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం కాబోతున్నారు. కథ బావుంటే ఖచ్చితం సినిమా, వెబ్ సిరిస్ ని నిర్మిస్తాం. మంచి కథలు వుంటే చెప్పండి. మేము సపోర్ట్ చేస్తాం. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే క్లీన్ ఎంటర్ టైనర్స్ ని అందిస్తాం' అన్నారు. 
 
నిర్మాత హరీష్ కోహిర్కర్ మాట్లాడుతూ.. శశి మధనం ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే ఎంటర్ టైనర్. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ వారికి థాంక్స్. చాలా అద్భుతమైన టీంతో కలసి చాలా మంచి ఎంటర్ టైనర్ ని ఇచ్చాం. ఈ రోజు సక్సెస్ సెలబ్రేషన్ జరుపుకోవడం ఆనందంగా వుంది. ఈ సిరిస్ కి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. సోనియా, పవన్ చాలా సపోర్ట్ చేశారు. టీం అందరికీ సపోర్ట్ వలన ఈ ప్రాజెక్ట్ ఇంత అద్భుత విజయం సాధించింది' అన్నారు. టీం అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments