Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ల‌రి న‌రేష్ 'సెల్ఫీరాజా'కు శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్‌

ఈ తరం హీరోల్లో తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్‌తో గతంలో "సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం" చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర

Webdunia
మంగళవారం, 12 జులై 2016 (17:18 IST)
ఈ తరం హీరోల్లో తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్‌తో గతంలో "సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం" చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు జి.ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుంక‌ర రామ‌బ్ర‌హ్మం స‌మ‌ర్ప‌ణ‌లో ఎ.కె.ఎంట‌ర్ టైన్మెంట్స్, గోపీ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై రూపొందుతున్న హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ 'సెల్ఫీరాజా'. చ‌ల‌సాని రామ‌బ్ర‌హ్మం చౌద‌రి ఈ చిత్రాన్ని నిర్మించారు. సాక్షిచౌదరి, కామ్నా రనవత్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి యంగ్ హీరో శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ అందిస్తుండ‌టం విశేషం. ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగే శ‌ర్వానంద్ వాయిస్ ఓవ‌ర్ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని చిత్ర‌ యూనిట్ భావిస్తుంది. 'గ‌మ్యం' వంటి బెంచ్ మార్క్ మూవీతో పాటు, నువ్వా నేనా అనే ఎంట‌ర్ టైనింగ్ మూవీలో శ‌ర్వానంద్‌, అల్ల‌రి న‌రేష్‌ల కాంబినేష‌న్ స‌క్సెస్ అయ్యింది. 'సెల్ఫీరాజా' చిత్రానికి వాయిస్ అందించ‌డం ద్వారా వీరు మూడోసారి క‌లిసి ప‌ని చేస్తున్న‌ట్ట‌య్యింది. 
 
సినిమా టైటిల్ నుండి సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే విడుద‌ల‌కు ముందు టూర్‌లో విడుద‌ల చేసిన సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. నరేష్ నుండి ఎలాంటి కామెడీ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడితో నరేష్ నవ్వించడానికి జూలై 15న 'సెల్ఫీరాజా'గా రెఢీ అయిపోయారంటూ చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఎమ్మెల్సీ ఎన్నికలు.. వార్ రూమ్‌ సిద్ధం చేయండి.. నారా లోకేష్

ప్రపంచ పెట్టుబడిదారుల సమ్మిట్-2025: మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం : జీవీ రెడ్డి రాజీనామా.. టీడీపీకి కూడా...

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments