Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమాని కోసం బ‌ట్ట‌లు విప్పిన‌ శ‌ర్వానంద్‌

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (22:43 IST)
Jerkin Before, After
హీరో అభిమానులు త‌మ హీరోపై ఎంత ప్రేమ చూపిస్తారో, ఒక్కోసారి హ‌ద్ద‌లు దాటుతుంది. ఇంకోసారి మొహ‌మాటానికి త‌ప్ప‌దు అనిపిస్తుంది. ఓ సినిమాలో హీరో రోడ్డు మీద వెళుతుంటే చ‌లిలో బాగా వ‌ణికిపోతున్న పెద్దాయ‌న‌ను చూసి త‌న‌వేసుకున్న కోటు ఇచేస్తాడు. ఆ త‌ర్వాత మ‌రొక‌రికి చొక్కా కూడా ఇచ్చేస్తాడు. ఇంకొక‌రికి ఫ్యాంట్‌.. ఇలా అన్నీ ఇచ్చేసి నిక్క‌ర్‌తో ఇంటికి వ‌స్తాడు. ఇలాంటివి ఆయ‌న భార్య‌కు మామూలైనా చూసే ప్రేక్ష‌కుడికి మంచి వినోదాన్ని ఇస్తుంది.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే, హీరోల అభిమానుల‌కు ఏం వ‌చ్చినా ఆప‌లేం. వారి క‌ళ్ళ‌లో ఆనందం కోసం ఏదైనా చేయాలి త‌ప్ప‌దు. గ‌తంలో వేళ్ళ‌మీద లెక్కించే హీరోలు అలా అభిమానుల‌కోసం చేసిన సంద‌ర్భాలున్నాయి. తాజాగా హీరో శ‌ర్వానంద్ ఓ చిత్ర‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు. త‌ను న‌టించిన `మ‌హాస‌ముద్రం` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లో పాల్గొన్న అభిమాని కోసం త‌ను వేసుకున్న బ్లూ జ‌ర్కిన్ ఇచ్చేయాల్సివ‌చ్చింది. సినిమా గురించి శ‌ర్వానంద్ మాట్లాడుతుండ‌గా అభిమానులు సూప‌ర్‌.. ట్రైల‌ర్ అంటూ నినాదాలు చేశారు. అప్పుడో ఓ అభిమాని మీరేసుకున్న జ‌ర్కిన్ బాగుంది. ఇస్తారా అంటూ అడిగేశాడు. వెంట‌నే శ‌ర్వానంద్ నీకు న‌చ్చిందా.. థ్యాంక్స్‌.. అంటూ.. కాసేప‌టికి ఆ అభిమానికి ఇచ్చేశాడు. ఇది చూసిన ద‌ర్శ‌కుడు స‌ర‌దాగా.. ఇంకా న‌యం ఫ్యాంట్ బాగుంద‌ని అడ‌గ‌లేద‌నే స‌రికి అది విన్న‌వారంతా కాసేపు న‌వ్వుకున్నారు.
 
ఆ త‌ర్వాత మ‌రో ఇద్ద‌రు అభిమానులు తాము వైజాగ్‌లో షూటింగ్ ఎక్క‌డ జ‌రిగితే అక్క‌డ‌కు వ‌చ్చాం సార్‌.. మీతో ఫొటో తీసుకోలేపోయా అన్నాడు. వెంట‌నే శ‌ర్వానంద్ వారిని పిలిచి సెల్ఫీ దిగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఏస్ ఆమ్రపాలిపై తెలంగాణ సర్కారుకు ఎందుకో అంత ప్రేమ?

వివాహిత మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం- సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై కేసు

వ్యక్తి ప్రాణం తీసిన ఆవు.. ఎలా? వీడియో వైరల్

ఇంట్లోనే కూతురిని పూడ్చి పెట్టిన కన్నతల్లి.. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి...

చిల్లర్లేదు.. ఇక రాయన్న రైల్వేస్టేషన్‌లో క్యూఆర్‌ కోడ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

తర్వాతి కథనం
Show comments