Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌ర్వానంద్ `ఒకే ఒక జీవితం`లో అమ‌ల‌

Webdunia
గురువారం, 15 జులై 2021 (18:52 IST)
Sharwanand
హీరో శ‌ర్వానంద్ కెరీర్‌లో రూపొందుతోన్న 30వ చిత్రం `ఒకే ఒక జీవితం`. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్  ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు నిర్మిస్తున్నారు. సైన్స్‌ఫిక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ చిత్రానికి త‌రుణ్ భాస్క‌ర్ డైలాగ్స్ అందిస్తున్నారు.
 
ఇటీవ‌ల విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రోజు ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్ర‌కి సంభందించి ఒక‌ స్నీక్ పీక్ ప్రోమోను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ వీడియోలో పాట పాడమని కొంద‌రు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్‌ట్రూమెంట్స్ ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో ఈ ప్రోమో ముగుస్తుంది. చివ‌ర‌లో శర్వానంద్ గిటార్ వాయించడం మ‌నం చూడొచ్చు. మొత్తానికి ఈ ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 
 
తెలుగ‌మ్మాయి రీతు వ‌ర్మ‌హీరోయిన్ గా న‌టిస్తుండగా వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి స‌పోర్టింగ్ రోల్స్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని అమ‌ల ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌డం విశేషం. జేక్స్ బీజోయ్ సంగీతం స‌మ‌కూరుస్తుండగా `డియ‌ర్ కామ్రెడ్` ఫేమ్ సినిమాటోగ్రాఫ‌ర్‌, ఎడిట‌ర్ సుజీత్ సారంగ్, శ్రీ జిత్ సారంగ్ ఈ చిత్రంలో భాగ‌మ‌య్యారు.
 
ఫ్యామిలీ ఆడియ‌న్స్ లో శ‌ర్వానంద్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. సైన్స్ ఫిక్ష‌న్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌తో పాటు యూత్‌కి న‌చ్చే విధంగా ఉంటుంద‌ని చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్ప‌టికే `ఒకే ఒక జీవితం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది`. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ద‌మైంది.
తారాగ‌ణం: శ‌ర్వానంద్‌, రీతు వ‌ర్మ‌, అమ‌ల అక్కినేని, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, నాజ‌ర్‌
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: శ్రీ కార్తిక్‌, నిర్మాత‌లు:ఎస్ ఆర్ ప్ర‌కాశ్ బాబు, ఎస్ ఆర్ ప్ర‌భు, మాట‌లు: త‌రుణ్ భాస్క‌ర్‌, కెమెరాః సుజిత్ సారంగ్‌, సంగీతం: జేక్స్ బిజోయ్‌, ఎడిట‌ర్‌: శ్రీ‌జీత్ సారంగ్‌.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments