Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌ర్వానంద్ చేతుల‌మీదుగా 'ఓ పిల్లా నీ వ‌ల్లా' టీజ‌ర్ లాంచ్‌

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. ఇటీవ‌లే టా

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:23 IST)
కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. ఇటీవ‌లే టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `ఓ పిల్లా నీ వ‌ల్లా` పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింద‌ని ప్ర‌శంసించారంతా. 
 
తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ని `శ‌త‌మానం భ‌వ‌తి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో తారాప‌థంలోకి దూసుకొచ్చిన మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. 'టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులు వైవిధ్యాన్ని, కొత్త‌ద‌నాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ద‌ర్శ‌కనిర్మాత కిషోర్‌కి అభినంద‌న‌లు' అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ... 'ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ - యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో, మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్క‌రించిన పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే  మెస్మ‌రైజింగ్ స్టార్‌ శ‌ర్వానంద్‌లాంటి స‌క్సెస్‌ఫుల్ హీరో మా సినిమా టీజ‌ర్‌ని ఆవిష్క‌రించ‌డ‌మే ఓ పెద్ద స‌క్సెస్‌గా భావిస్తున్నాం. శ‌ర్వాకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు' అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments