Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాహిద్‌తో కాటేజీ షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల: కంగనా రనౌత్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై విరుచుకుపడింది. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రంగూన్’ షూటింగ్ సందర్భంగా షాహిద్ కపూ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (17:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌పై విరుచుకుపడింది. విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రంగూన్’ షూటింగ్ సందర్భంగా షాహిద్ కపూర్‌తో కాటేజీని షేర్ చేసుకోవడంపై కంగనా రనౌత్ స్పందించింది. షాహిద్ కపూర్, కంగనా రనౌత్‌ల మధ్య రంగూన్ సినిమా షూటింగ్ సందర్భంగా కోల్డ్‌వార్ జరిగినట్టుగా బిటౌన్‌లో ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపథ్యంలో కంగనాతో గొడవల్లేవని షాహిద్ చెప్తుండగానే.. కంగనా మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ షెడ్యూల్ సందర్భంగా షాహిద్‌తో ఒకే కాటేజిలో కలిసుండడమే తనకు ఎదురైన అతిపెద్ద సమస్యగా భావిస్తున్నట్టు పేర్కొంది. కాటేజ్ సౌకర్యాలు కూడా సరిగాలేని ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్‌కి వెళ్లామని.. అక్కడ కాటేజీలు లేక.. షాహిద్‌తో తాను కాటేజీ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంగనా చెప్పింది. 
 
షాహిద్‌కు స్పీకర్స్ దద్దరిల్లిపోయేలా పెద్ద పెద్ద సౌండ్స్‌తో చిత్రమైన పాటలు వినడం అలవాటు. ప్రతిరోజు ఆ హిప్ హాప్ మ్యూజిక్‌కి అదిరిపడుతూ లేవాల్సివచ్చేది. లేచిన వెంటనే రెడీ ఏదోఒకటి తిని బయటపడేదాని అంటూ కంగనా చెప్పుకొచ్చింది. మొత్తానికి షాహిద్‌తో కాటేజి షేర్ చేసుకోవాల్సిరావడం నాకో పీడకల అంటూ కంగనా కామెంట్ ఇచ్చేసింది. మరి దీనిపై షాహిద్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments