'అర్జున్‌ రెడ్డి'కి నేనెప్పటికీ రుణపడి ఉంటాను.. షాలినీ పాండే

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (13:33 IST)
Arjun Reddy
ఆగస్టు 25 తన జీవితంలోనే కీలకమైన రోజంటూ.. నటి షాలినీ పాండే తెలిపింది. అంతేగాకుండా.. అర్జున్‌ రెడ్డి కోస్టార్‌ విజయ్‌ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పింది. దాదాపు ఐదేళ్ల క్రితం ఇదే రోజున తాను నటిగా వెండితెరకు పరిచయమైన 'అర్జున్‌ రెడ్డి' విడుదలై ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించిందని గుర్తు చేసింది. 
 
ఆ సినిమాలో తాను పోషించిన ప్రీతి పాత్రకు మీ నుంచి వచ్చిన ప్రేమాభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలినేనని షాలినీ పాండే వెల్లడించింది. ఈ సందర్భంగా 'అర్జున్‌ రెడ్డి'కి తానెప్పటికీ రుణపడి ఉంటా. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ధన్యవాదాలు. తొలి చిత్రం ఎలా చేస్తానోనని కంగారు పడుతోన్న తనలో ఉత్సాహాన్ని నింపి.. షూటింగ్ సరదాగా గడిచిపోయేలా చేశాడని కితాబిచ్చింది. 
 
"లైగర్‌'.. నువ్వు చేసిన ప్రతి పనికి థ్యాంక్యూ. లవ్ యూ. అలాగే నీ కొత్త సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నా'' అని షాలినీ రాసుకొచ్చింది. సందీప్‌ రెడ్డి వంగా - విజయ్‌ దేవర కొండ కాంబినేషన్‌లో తెరకెక్కిన రొమాంటిక్‌ చిత్రం 'అర్జున్‌ రెడ్డి'. షాలినీ పాండే కథానాయిక. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

Hayatnagar, ఏడేళ్ల బాలుడిపై 10 వీధి కుక్కల దాడి, చెవిని పీకేసాయి

వరి రైతుల ఖాతాల్లో రూ. 2,830 కోట్లు జమ చేశాం.. నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments