Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడ్లీ, వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్ నువ్వు? షారూఖ్‌పై ఫ్యాన్స్ ఫైర్

సెల్వి
మంగళవారం, 5 మార్చి 2024 (18:26 IST)
Sharukh Khan
పారిశ్రామిక వేత్త అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో షారూఖ్ మాట్లాడిన తీరు చాలా మందికి నచ్చడం లేదు. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను ఉద్దేశిస్తూ "ఇడ్లీ వడ" అనడంపై షారుఖ్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. 
 
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాటకు వీరందరూ కలిసి స్టెప్పులేశారు. అయితే సల్మాన్, అమీర్ సరిగా చేయకపోవడంతో రామ్ చరణ్‌ను స్టేజ్ మీదకు పిలిచాడు షారుఖ్ ఖాన్. అయితే ఇక్కడే కింగ్ ఖాన్ నోరు జారాడని రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ జీబా హసన్ ఆరోపిస్తోంది. 
 
"ఇడ్లీ, వడ రామ్ చరణ్ ఎక్కడున్నావ్ నువ్వు?" అని షారుఖ్ అన్నాడని, అది విన్న తర్వాత తాను చాలా అవమానంగా భావించి ఆ ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినట్లు జీబా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. 
 
గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన రామ్ చరణ్‌ను అలా పిలవడం దారుణమంటూ ఆమె పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణాది హీరోలంటే నార్త్ వాళ్లకు ఎప్పటి నుంచో చిన్నచూపు ఉందంటూ జీబా ఫైర్ అయ్యింది. 
 
తాను షారుఖ్‌కు పెద్ద అభిమానిని అని, అయితే చెర్రీ అతను స్టేజ్‌పై అవమానించిన తీరు తనకు నచ్చలేదని జీబా తన ఇన్ స్టా స్టోరీస్ పోస్ట్‌లో తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

బాత్రూం వెళ్లాలని చెప్పి - డబ్బు - నగలతో ఉడాయించిన వధువు... ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments