జ‌వాన్ లో షారుఖ్ ఖాన్ ఐదు ముఖాల పోస్ట‌ర్ విడుద‌ల‌

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (16:26 IST)
shRukh Khan Multifaceted Poster
మీ కేలండ‌ర్ల‌లో సెప్టెంబ‌ర్ 7ని మార్క్ చేసుకోండి. ఎస్ ఆర్ కె లోని ప‌లు పార్వ్శాల‌ను తెర‌మీద ఆవిష్క‌రించబోయేది ఆ రోజే!  షారుఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా జ‌వాన్‌. న‌య‌న‌తార నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రివ్యూ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ రోజు నుంచే షారుఖ్‌ఖాన్ తెర మీద ఎన్ని కోణాల్లో క‌నిపిస్తారోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్యాపించింది.
 
ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌క‌నే చెప్పింది ప్రివ్యూ. యాక్ష‌న్ గురించి జ‌నాలు ఎంత‌గా మాట్లాడుకుంటున్నారో, జ‌వాన్ సినిమాలో షారుఖ్‌ఖాన్ ఎన్ని గెట‌ప్పుల్లో క‌నిపిస్తారోన‌నే విష‌యం గురించి కూడా అంతే క్యూరియాసిటీతో మాట్లాడుకుంటున్నారు. అత‌ని గెట‌ప్పుల వెనుక ఉన్న క‌థ‌ల గురించి ఆస‌క్తిక‌రంగా ఆరా తీస్తున్నారు.
 
సినిమాలోని ఆయ‌న గెట‌ప్పుల‌న్నిటినీ సింగిల్ ఫ్రేమ్‌లోకి తెచ్చే విధంగా కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఇందులోని ఐదు డిఫ‌రెంట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రుస్తున్నాయి. ఒక‌దానితో ఇంకోదానికి పోలిక లేకుండా, ప్ర‌తి అవ‌తార్‌లోనూ త‌నకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో మెప్పిస్తున్నారు షారుఖ్‌.
 
ఈ పోస్ట‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ షారుఖ్ ఖాన్ నెవ‌ర్ సీన్ బిఫోర్ అవ‌తార్‌లో ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పండుగ క‌లిగాస్తార‌ని సంతోషిస్తున్నారు. 
సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా?  థియేట‌ర్ల‌కు వెళ్దామా? అని ఎదురుచూస్తున్నారు.
జ‌వాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తోంది. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుంది జ‌వాన్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments