Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోండి : సుప్రీంకోర్టు

వరుణ్
సోమవారం, 29 జనవరి 2024 (17:12 IST)
ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన తెలుగు సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఆయనపై క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ ఆదేశించింది. తనకు చెందిన "శ్రీమంతుడు" కథను కాపీ కొట్టారంటూ ప్రముఖ రచయిత శరత్ చంద్ర దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పైగా, హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ అపెక్స్ కోర్టు తేల్చి చెప్పింది. 
 
మహేష్ బాబు - శృతిహాసన్ జంటగా కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'శ్రీమంతుడు'. ఈ చిత్రం ఘన విజయం సాధించి, కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే, స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి ఈ చిత్రాన్ని తెరక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశారు జారీచేసింది. 
 
దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలంటూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సాగిన విచారణలో కూడా ఈ కథను కాపీ కొట్టినట్టు నిరూపించే ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ మేరకు రచయిత సంఘం కూడా హైకోర్టుకు నివేదికను ఇచ్చింది. వీటిని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు... నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించగా, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
ఈ పిటిషన్‌పై జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం కొరటాల శివ పిటిషన్‌ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. దీంతో కొరటాల శివకు చిక్కులు ఎదురుకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

ఎంపీ విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాలి.. నారా లోకేష్‌కు విజ్ఞప్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments