Webdunia - Bharat's app for daily news and videos

Install App

షూటింగ్ స్పాట్‌లో రియల్ ఫైట్...

Webdunia
మంగళవారం, 18 జూన్ 2019 (22:13 IST)
సాధారణంగా సినిమా లేదా టీవీ సీరియల్స్‌ షూటింగ్‌ల కోసం డూప్‌లతో ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంటారు. కానీ, ఇక్కడో షూటింగ్ స్పాట్‌లో రియల్ ఫైట్ జరిగింది. బుల్లితెర నటి రాగ మాధురిపై సహ నటి జ్యోతి, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రాగమాధూరి స్వల్పంగా గాయపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ టీవీ సీరియల్ షూటింగ్ స్పాట్‌లో తన బంగారపు గొలుసు పోయిందని రాగమాధూరి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొలుసును జ్యోతి అనే మహిళ చోరీ చేసివుండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. 
 
దీంతో పోలీసులు జ్యోతిని స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఇంతలో క్యాబ్ డ్రైవర్ తన కారులో చైన్ దొరికిందని స్టేషన్‌కు వచ్చి అందజేశాడు. ఈ చైన్‌ను తీసుకున్న రాగమాధూరి నేరుగా స్టేషన్‍ నుంచి షూటింగ్ స్పాట్‌కు వెళ్లిపోయింది. 
 
అయితే, తమను అనుమానించడమే కాకుండా, స్టేషన్‌కు పిలిపించి తమ పరువు తీసిందని ఆగ్రహించిన జ్యోతి తన అనుచరులతో కలిసి షూటింగ్ స్పాట్‌కు వెళ్లి రాగమాధూరిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న మాధూరి తిరిగి పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments