Webdunia - Bharat's app for daily news and videos

Install App

హన్సిక - 105 మినిట్స్' గ్లింప్స్ వీడియో ఆవిష్క‌రించిన సెంథిల్ కుమార్

Webdunia
శుక్రవారం, 5 నవంబరు 2021 (16:46 IST)
105 Minutes team with Senthil Kumar
హన్సిక మొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్” తో ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. 
 
చిత్ర గ్లింప్స్ వీడియోని పాపులర్ సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్ విడుదల చేస్తూ "హాలీవుడ్ లో మాత్రమే ప్రయత్నించిన సింగిల్ షాట్ చిత్రీకరణ కి నేను పెద్ద అభిమాని ని అలా మానవాళ్లెవరు చెయ్యట్లేదు అనుకుంటుండగా '105 మినిట్స్' రాజు చేసి చూపిస్తున్నారు. కథ కథనం చాలా థ్రిల్లింగ్ గా అనిపించాయి.

105 మినిట్స్ సింగిల్ షాట్ అంటే ఒక టెక్నీషియన్ గా అది ఎంత కష్టమో నాకు తెలుసు. మన తెలుగు పరిశ్రమలో ఇలాంటి కొత్త తరం ఆలోచనతో కథలు తెరకెక్కిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక రిస్కి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా గట్స్ ఉండాలి. అనుక్కున్నట్టుగా తీసిన చిత్ర బృందం అంతటికి ఈ చిత్రం పెద్ద సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను" అన్నారు.
 
రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు, సామ్ సి.యస్ సంగీతం అందిస్తున్నారు.
 
ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలని వేగంగా జరుపుతుంది చిత్ర బృందం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments