Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయన్లు కాదు... సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయ్ : నటి జమున

Webdunia
ఆదివారం, 19 మే 2019 (15:55 IST)
వెండితెరపై అందాలు ఆరబోయడానికి పోటీపడుతున్న నేటితరం హీరోయినలపై సీనియర్ నటి జమున విమర్శలు గుప్పించారు. ఇప్పటి నటీమణులు హీరోయిన్లు కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. పైగా, ఇప్పటితరం హీరోయిన్ల వైఖరిపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తమ కాలంలో రొమాంటిక్ సీన్స్ తీయాలంటే అందుకు పరిమితి అంటూ ఒకటి ఉండేదన్నారు. తమ హయాంలో సెన్సార్ బోర్డు కూడా చాలా కఠినంగా ఉండేదని చెప్పారు. ఇప్పటి సినిమాల్లో కొన్ని సన్నివేశాలు చాలా అసభ్యకరంగా ఉంటున్నాయని జమున ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇపుడు బాలీవుడ్ చిత్రాల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడేందుకు వీలుగా రొమాంటిక్ సన్నివేశాలు సినిమాలో పెడుతున్నారని ఆమె ఆరోపించారు. అందుకే ఇప్పటితరం చిత్రాలను తాను చూడటం మానేశానని గుర్తుచేశారు.
 
ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు కూడా కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని, మంచి వేషాలపై వారు దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లే కనిపించడం లేదని, ఇతర భాషల నుంచి హీరోయిన్లను తీసుకొస్తున్నారని, వారు వచ్చిరాని తెలుగులో మాట్లాడుతున్నారన్నారు. నిర్మాతలు, దర్శకులు వెతికితే తెలుగులో ఎంతో మంది మంచి నటీమణులు దొరుకుతారని ఆమె అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments