Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియా- రితేష్ దేశ్ ముఖ్ రెండో పుత్రుడి పేరు రహైల్.. సోషల్ మీడియాలో ఫోటో.. కానీ..?

బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పటికే రియాన్ అనే రెండేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం రెండోసారి కూడా మగబిడ్డకు జెనీలియా జన్మనిచ్చిం

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (12:03 IST)
బొమ్మరిల్లు హీరోయిన్ జెనీలియా.. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఇప్పటికే రియాన్ అనే రెండేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం రెండోసారి కూడా మగబిడ్డకు జెనీలియా జన్మనిచ్చింది. రహిల్ జన్మించి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇప్పటిదాకా ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల కాలేదు. తాజాగా రెండో బాబుకి రహైల్ అనే పేరు పెట్టిన సందర్భంగా జెనిలియా తన సోషల్ మీడియా ద్వారా రహిల్ ఫోటోని పోస్ట్ చేసింది. 
 
జెనీలియా ముద్దాడుతున్నట్లు ఉన్న ఆ ఫోటో చూస్తే ఫ్యాన్స్ నిరాశే మిగులుతుంది. ఈ ఫోటోలో రహైల్ ముఖం మాత్రం కనిపించడం లేదు. ఓ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి సినిమాలకి దూరంగా ఉన్న జెనిలియా త్వరలో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని వార్తలొచ్చాయి. అయితే రెండోసారి గర్భం దాల్చడంతో, మరో బిడ్డకు జన్మనివ్వడంతో జెనీలియా ఇప్పట్లో సినిమాల్లోకి వచ్చే అవకాశాలు తక్కువేనని తేలిపోయింది.  
 
దక్షిణాదిన బాగా పాపులరైన జెనీలియా.. బాలీవుడ్ మాత్రం రాణించలేకపోయింది. అయితే ''తుజే మేరీ కసమ్‌" చిత్రంతో రితేశ్‌, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో వీరిద్దరికీ వివాహమైంది. 2014 నవంబర్‌లో వీరికి రియాన్, 2016 జూన్ 1న రహైల్ జన్మించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐఎన్ఎస్ విక్రాంత్‌పై దాడి చేశాం... భారత్‌ను భయపెట్టాం : పాక్ ప్రధాని గొప్పలు

ఉగ్రవాదులకు జ్యోతి మల్హోత్రా పహెల్గాం లొకేషన్ షేర్ చేసిందా?, నాకేం తెలియదంటున్న ఆమె తండ్రి

Chandrababu: మే 22 నుండి మూడు రోజుల పాటు ఢిల్లీలో చంద్రబాబు

ఏపీ లిక్కర్ స్కామ్ : నిందితులకు షాకిచ్చిన ఏసీబీ కోర్టు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments