Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్, ప్రియాంకా అరుళ్‌ మోహన్ మూవీ కెప్టెన్ మిల్లర్ నుంచి సెకండ్ సింగిల్

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2023 (18:15 IST)
Dhanush,Priyanka Arul Mohan
సూపర్ స్టార్ ధనుష్ మోస్ట్ అవైటెడ్ పీరియడ్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది.  ఫస్ట్ సింగిల్ కిల్లర్ కిల్లర్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
 
ఈ రోజు మేకర్స్ 'కెప్టెన్ మిల్లర్' సెకండ్ సింగిల్ క్రీనీడలే పాటని ని విడుదల చేశారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ ఈ పాట కోసం హార్ట్ టచ్చింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. రాకేందుమౌళి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. సింగర్ జావేద్ అలీ చాలా లైవ్లీగా అలపించారు. ఈ పాటలో ధనుష్, ప్రియాంకా అరుళ్‌ మోహన్ కెమిస్ట్రీ ని ప్రజెంట్ చేసిన విధానం చాలా ఎట్రాక్టివ్ గా వుంది.  
 
1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యుజ్ బడ్జెట్ తో ఈ  చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ  పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌ సహా నిర్మాతలు.  
 
ఈ చిత్రం ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని డీవోపీ గా పని చేస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజీ, RRR, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందిస్తున్నారు. నాగూరన్ ఎడిటర్.
 
‘కెప్టెన్ మిల్లర్’ '2024 సంక్రాంతికి తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
తారాగణం: ధనుష్, ప్రియాంక మోహన్, సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments