Webdunia - Bharat's app for daily news and videos

Install App

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

డీవీ
గురువారం, 19 డిశెంబరు 2024 (15:36 IST)
Jyoti Purvaj, Purvaj,
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాల దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. 
 
"కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా  సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామెజీ ఫిలిం సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. సెకండ్ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  
 
హీరో, దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ - "కిల్లర్" సినిమా ఔట్ పుట్ మేము అనుకున్నట్లే బాగా వస్తోంది. లవ్, రొమాన్స్,  ప్రతీకారం, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో మా సినిమాను రూపొందిస్తున్నాం. ఎ మాస్టర్ పీస్ సినిమాతో పాటు మా సంస్థలో వస్తున్న చిత్రంగా "కిల్లర్" మూవీపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సినిమాను చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా "కిల్లర్" ఒక స్పెషల్ మూవీగా మీకు గుర్తుండిపోతుంది. అన్నారు.
నటీనటులు - జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్, తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దని అమ్మకే ఫోన్ చేశారు.. గుడివాడ అమర్‌నాథ్ (video)

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments