Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ హీరోకు 60 - ఆ కుర్రపిల్లకు 23 ... ఈ జోడీ విడ్డూరంగా లేదు!!

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (13:17 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన ప్రతిభావంతులైన వారికి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు. ఇలాంటి వారిని వెతికిమరీ ఛాన్సులిస్తారు. తాజాగా అలాంటి అవకాశమే ఓ కుర్రపిల్లకు ఇచ్చారు ఆ పిల్ల పేరు సయేషా సెగల్. గతంలో అక్కినేని మూడో తరం హీరో అఖిల్ నటించిన చిత్రంలో కనిపించింది. సయేషాను తనకు జోడీగా బాలకృష్ణ ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనతో సినిమా తీస్తున్న ద్వారకా క్రియేషన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇంతవరకు బాగానేవుంది. 
 
కానీ, 60 యేళ్ళ బాలకృష్ణ సరసన 23 యేళ్ల సయేషా సైగల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయడమే కాస్తంత విడ్డూరంగా వుంది. నిజానికి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మొన్నటివరకు మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్‌ను ఎంపిక చేసారని వినిపించింది. ఆ తర్వాత ప్రగ్యా జైశ్వాల్‌ పేరును ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. 
 
కానీ, ఇపుడు సయేషా పేరు తెరపైకి వచ్చింది. అఖిల్ సినిమా తర్వాత తెలుగులో సయేషా మళ్లీ కనిపించలేదు. ఇక్కడ అవకాశాలు కూడా రాలేదు. కానీ ఇదేసమయంలో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా నటిగా మారిపోయారు. తమిళంలో కుర్ర హీరోలందరితోనూ నటిస్తోంది. 
 
అదేక్రమంలోనే 'భలేభలే మగాడివోయ్' రీమేక్ 'గజినీకాంత్‌'లో తనతో పాటు నటించిన 'ఆర్య'ను పెళ్లి చేసుకుంది సయేషా. పెళ్ళి తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే అవకాశాలు వచ్చిన ప్రతీసారి ముందుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా తెలుగులో బాలయ్య సినిమాకు ఓకే చెప్పింది. 
 
ఈ సినిమాలో పూర్ణ మరో హీరోయిన్. మరోవైపు హాట్ బ్యూటీ నమిత ఇందులో ప్రతినాయ ఛాయలున్న రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతుంది. మొత్తానికి బాలయ్యతో సయేషా జోడీ ఎలా ఉండబోతుందో చూడాలిక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments