Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో సత్యదేవ్ చిత్రం కృష్ణమ్మ

Webdunia
సోమవారం, 4 జులై 2022 (09:26 IST)
Satyadev look
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న వర్సటైల్ హీరో సత్యదేవ్ పుట్టినరోజు (జూలై 4) సందర్భంగా కొత్త సినిమా కృష్ణమ్మ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీ వీ గోపాల కృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం నాడు చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సత్యదేవ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఆ కత్తి పట్టుకుని స‌త్య‌దేవ్ నిలుచుకున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత... పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే ఓ భావం ఎలివేట్ అవుతుంది.
 
కృష్ణమ్మ అనే టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్‌గా అనిపిస్తోంది. ఇక ఈ యాక్షన్ మూవీకి సన్నీ కూరపాటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కాళ భైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
 
ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.
 
నటీనటులు : సత్యదేవ్, లక్ష్మణ్, కృష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం తదితరులు
 
సాంకేతికబృందం
దర్శకత్వం : వీ వీ గోపాల కృష్ణ
నిర్మాత : కృష్ణ కొమ్మలపాటి
బ్యానర్ : అరుణాచల క్రియేషన్స్
సమర్పణ : కొరటాల శివ
సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి
సంగీతం : కాళ భైరవ
ఎడిటర్  : తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్  : రామ్ కుమార్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

Revanth Reddy:Allu Arjun కాళ్ళు పోయాయా, చేతులు పోయాయా... ఓదార్పు ఎందుకు? (video)

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

కూటమి ప్రభుత్వానికి వడ్డీతో సహా చెల్లిస్తాం: వైసిపి మాజీ మంత్రి రోజా

YS Jagan: జగన్ పుట్టినరోజు బ్యానర్‌లో అల్లు అర్జున్ ఫోటో.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

తర్వాతి కథనం
Show comments