Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌త్య‌దేవ్ చిత్రం గాడ్సే రిలీజ్ డేట్ ఖ‌రారు

Webdunia
బుధవారం, 18 మే 2022 (18:03 IST)
Satyadev
సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే  ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందేనంటున్నారు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్. మరి ఇంత‌కీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించే యువ‌కుడు గాడ్సేగా ఎవ‌రు క‌నిపించ‌బోతున్నారో తెలుసా!  స‌త్య‌దేవ్‌..
 
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ లెవ‌ల్లో సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందిస్తున్నారు.
 
అవినీతిమ‌య‌మైన రాజ‌కీయ నాయ‌కుల‌ను, వ్య‌వ‌స్థ‌ను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్య‌వంతుడైన యువ‌కుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ క‌నిపించ‌నున్నారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

రూ. 287 కోట్ల లాటరీ, డబ్బు అందుకునేలోపుగా అతడిని వెంటాడిన మృత్యువు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

తర్వాతి కథనం
Show comments