Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌రిలేరు నీకెవ్వ‌రు గురించి స‌త్య‌దేవ్ ఏం చెప్పాడో తెలుసా..?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (21:55 IST)
జ్యోతిల‌క్ష్మి సినిమాతో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న స‌త్య‌దేవ్.. ఆ త‌ర్వాత బ్రోచేవారెవ‌రురా, ఇస్మార్ట్ శంక‌ర్, రాగ‌ల 24 గంట‌ల్లో... ఇలా వ‌రుస‌గా విభిన్న క‌థా చిత్రాల్లో న‌టిస్తున్నాడు. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో స‌త్య‌దేవ్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి బ‌య‌ట‌పెట్టాడు.
 
ఇంత‌కీ స‌త్య‌దేవ్ ఏం చెప్పాడంటే... సరిలేరు నీకెవ్వరు సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాను. అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎందుకంటే... ఆ సినిమా గురించి వాళ్లే ఏం చెప్పడం లేదు. చిన్న పాత్ర పోషించిన నేను ఇప్పుడే మాట్లాడితే బాగుండదు. కానీ నా పాత్ర మాత్రం సినిమాలో చాలా చాలా కీలకమైనది. తక్కువ టైమ్ కనిపిస్తాను కానీ అందరికీ రిజిస్టర్ అయిపోతుంది.
 
మహేష్ బాబుతో వర్క్ చేయడం ఎప్పుడూ బాగుంటుంది. మహేష్ ఓ సూపర్ స్టార్. ఆయనతో పని చేయడం అనేది మ‌ర‌చిపోలేని అనుభూతి. మహేష్‌ను చూస్తే అలానే చూడాలనిపిస్తుంది. ఆయన సెట్స్‌కు వస్తే ఒక రకమైన సందడి. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేశాను. ఆ సినిమాలో మహేష్ గారికి నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడ్ని నేను. ఇప్పుడు మహేష్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదిగాన‌నే.... ఆ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది అంటూ సంతోషం వ్య‌క్తం చేసాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments