Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో లాంచనంగా ప్రారంభ‌మైన స‌త్య‌దేవ్ 25వ చిత్రం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (16:26 IST)
Koratala, dilraju, sathya dev etc
తిమ్మ‌రుసు హీరో స‌త్య‌దేవ్ 25వ చిత్రం బుధ‌వారం లాంచ‌నంగా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కిస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడు. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్‌.నెం.2గా కృష్ణ కొమ్మ‌ల‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గురువారం హైద‌రాబాద్‌లో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. 
 
ముహూర్త‌పు స‌న్నివేశానికి దిల్ రాజు క్లాప్‌కొట్ట‌గా, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కెమెరా స్విచ్ ఆన్ చేసి, గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిర్మాత దిల్‌రాజు, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌, ప్ర‌ముఖ ఫైనాన్సియ‌ర్ ఎంఆర్‌విఎస్‌.ప్ర‌సాద్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు వి.వి.గోపాల‌కృష్ణ‌కు అందించారు. ఇది వ‌ర‌కే విడుద‌లైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. మ‌రో స‌రికొత్త పాత్ర‌లో స‌త్య‌దేవ్ మెప్పించ‌నున్నార‌ని కాన్సెప్ట్ పోస్ట‌ర్‌తో అర్థ‌మైంది. 
 
sathadev movie opening
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తున్న స‌త్య‌దేవ్ త‌న 25వ చిత్రంలో ఎలాంటి పాత్ర‌ను పోషించ‌బోతున్నాడ‌నేది ఆస‌క్తిని రేపే అంశాల్లో ఒక‌టైతే, ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తొలిసారి ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క‌లిగిస్తోంది. కాల భైర‌వ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ, న‌వీన్ నూలి ఎడిట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల విష‌యాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments