Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం సృష్టించారు

Webdunia
గురువారం, 12 మే 2022 (18:38 IST)
parasuram, Ravishankar,naveen
సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు ప్రీమియర్ షో నుండి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా వుంది. సర్కారు వారి పాటతో మహేష్ బాబు ప్రభంజనం  సృష్టించారు'' అన్నారు దర్శకుడు పరశురాం. మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా  నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్  మీట్ నిర్వహించింది. దర్శకుడు పరశురాంతో పాటు  నిర్మాతలు  నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మీట్ లో పాల్గొని మీడియాతో మాట్లాడారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. మొదటి ఆట నుండే  సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ , క్లాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు సర్కారు వారి పాట నచ్చింది. మహేష్ బాబు గారితో సర్కారు వారి పాట లాంటి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా అయితే బావుంటుదని బలంగా నమ్మి సెట్స్ కి వెళ్ళడం జరిగిందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు చాలా ఆనందంగా వుంది. మార్నింగ్ షో నుండి కొనసాగుతున్న ప్రభంజనం అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇంకా బలంగా తాకుతుందని నమ్ముతున్నాను. సర్కారు వారి పాట దేశం ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐ తో ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ మనిషి వుండరు. అలాంటి పాయింట్ ని మహేష్ బాబు గారి లాంటి సూపర్ స్టార్ తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. ఇలాంటి కథ రాయడం రచయిత, దర్శకుడిగా నాకూ ఒక తృప్తిని ఇచ్చింది. సర్కారు వారి పాటని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు '' అన్నారు పరశురామ్
 
Producers calebrations
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా అద్భుతంగా వుందని సందేషాలు పంపుతున్నారు. ఇంత ఘన విజయం ఇచ్చిన మా హీరో  సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, దర్శకుడు పరశురామ్ గారి చాలా కృతజ్ఞతలు. 2020లో ప్రాజెక్ట్ అనుకున్నాం. తర్వాత ప్యాండమిక్ వచ్చింది. అయితే ఈ రెండేళ్ళ కష్టం.. సర్కారు వారి పాట కు వచ్చిన బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ఒక్కసారిగా ఎగిరిపోయింది. మా బ్యానర్ లో బెస్ట్ రెస్పాన్స్ వచ్చిన మూవీ సర్కారు వారి పాట. సుదర్శన్ లో సినిమా చూశాం. ఫ్యాన్స్ కి సినిమా ఫుల్ మీల్స్ లా వుంది. షో అయిన తర్వాత ఫ్యాన్స్ కేక్  కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. సర్కారు వారి పాట ఫస్ట్ డే నే కాదు..  ఈ రెండు వారాలు  భారీ కలెక్షన్స్ సాధించబోతుంది. యూఎస్ ప్రిమియర్ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులన్నీ క్రాస్ చేసింది. అదే స్థాయిలో ఇక్కడ కూడా కలెక్షన్స్ కొనసాగుతున్నాయి.  ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు'' తెలిపారు
 
నిర్మాత వై. రవిశంకర్ మాట్లాడుతూ... సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందగా వుంది. ట్రైలర్ చూసి ప్రేక్షకులు ఎంత ఎక్సయిటింగా ఫీలయ్యారో .. సినిమా చూసి అంతకంటే ఎక్కువ ఎక్సయిట్ అయ్యారు. ఈ మధ్య  కాలంలో ఇంత పండగలాంటి సినిమా సర్కారు వారి పాటే.
ఇప్పుడడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో సర్కారు వారి పాట లాంటి  పెద్ద సినిమా మళ్ళీ చూడగలమా అంటే సందేహమే. మహేష్ బాబు గారు సర్కారు వారి పాటలో నటన పరంగా విజ్రుభించారు. అందరూ థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి. సర్కారు వారి పాట మేము వూహించినదాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments