Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాటకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఖుషీలో టీమ్

Webdunia
సోమవారం, 9 మే 2022 (17:28 IST)
సర్కారు వారి పాటకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్  చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, ఎయిర్ కండిషన్, సాధారణ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 
 
ఈ నెల 12 నుంచి 7 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. మరోవైపు ఈనెల 12 నుంచి 18 వరకు ఉదయం 7 నుంచి అర్థరాత్రి 1 వరకు 5వ షో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
ఇకపోతే.. సర్కారు వారి పాట ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే "కళావతి" సాంగ్ యూట్యూబ్‌లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. 
 
దీంతో పాటు "మ మ మషేషా" సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా సర్కారు వారి పాట రిలీజ్ కాబోతోంది. ఇందులో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. పరుశురామ్ దర్మకత్వం వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments