Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్ వల్లభబాయ్ పటేల్ లేకపోతే మనం ఇలా ఉండేవాళ్లం కాదు : కే రాఘవేంద్రరావు

డీవీ
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (16:17 IST)
K Raghavendra Rao
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మించిన చిత్రం ‘రజాకార్’. ఈ చిత్రం నుంచి ఆల్రెడీ ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను రిలీజ్ చేశారు. టీజర్‌ను కూడా విడుదల చేశారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. 
 
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘రజాకార్ లాంటి చిత్రాన్ని నిర్మించిన గూడూరు నారాయణ రెడ్డి గారికి థాంక్స్. చరిత్ర గురించి యువతకు చెప్పాలని ఈ చిత్రాన్ని తీశారు. ఎంతో మంది త్యాగాలు చేస్తే ఈ రోజు మనం ప్రశాంతంగా ఉన్నాం. చరిత్రను ఇలా దృశ్యరూపంలో చూపిస్తే మరింతగా అర్థం అవుతుంది. ట్రైలర్ చూస్తే నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. మా శిష్యుడు యాటా సత్య నారాయణ నా వద్ద పదేళ్లు పని చేశాడు. చాలా అద్భుతంగా పని చేసేవాడు. సుద్దాల రక్తంతో పాటలు రాస్తారా? అని అనిపిస్తుంది. సర్దార్ వల్లభబాయ్ పటేల్ లేకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్లం కాదు. రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్లు ఉండబట్టే ఇంకా భారతీయత ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ‘ఇది చరిత్ర. ఇది రక్త చరిత్ర. రక్తాక్షరాల చరిత్ర. రజాకార్ల రక్తాక్షరాల చరిత్ర పోతు గడ్డ మీద ఎలా జరిగిందని చారిత్రక వాస్తవాన్ని చూపించే ప్రయత్నం.. ఇది ప్రయత్నం కాదు.. యజ్ఞం.. వెండితెరపై యజ్ఞం చేయడం జరిగింది. ఈ సినిమాను తీసిన యాటా స‌త్య‌నారాయ‌ణ, గూడూరు నారాయ‌ణ రెడ్డి గార్లకు స్వాతంత్ర్య సమర యోధుల బిడ్డగా ధన్యవాదాలు. ఇది రెండు మతాల మధ్య వైషమ్యం కాదు. రజాకార్లలో హిందువులు కూడా ఉన్నారు. అల్లూరిని కాల్చిన బ్రిటీష్ వారిలో మన ఇండియన్ వాళ్లు ఉన్నట్టే.. రజాకార్లలో కూడా హిందువులున్నారు. రజాకార్లను వ్యతిరేకిస్తూ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వాళ్లలో మగ్దూం మొయినుద్దీన్ అనే గొప్ప కవి కూడా ఉన్నారు. ఖాసీం రజ్వీ మొదటగా ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ తలను నరికాడు. ఇందులో నేను రెండు పాటలు రాశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సుద్దాల హన్మంతు డీఎన్ఏ ఉంది కాబట్టే ఇందులో పాటలు రాశాను. మార్చి 1న ఈ చిత్రం రాబోతోంది. ఇది సంచలనం మాత్రమే కాదు.. లక్షల కోట్ల మంది ఈ చిత్రాన్ని వీక్షించి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments