Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్దార్‌లో పవన్ కల్యాణ్‌ ఫ్లోర్ అదరిపోయే స్టెప్పులు.. దేవీశ్రీ ప్రసాద్‌తో ఛాలెంజ్!!

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (15:48 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ జల్సా సినిమా నుంచి ట్యూన్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కనుంది. గబ్బర్ సింగ్ సినిమాలో సాంగ్స్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా కంటే ఎక్కువ అవుట్ పుట్ ఇవ్వాలని పవన్- దేవీశ్రీ ప్రసాద్ కుస్తీ పడుతున్నారట. ఈ క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్ మాంచి మాస్ బీట్ ఒకటి కంపోజ్ చేసి పవన్‌కి సర్ ప్రైజ్ ఇచ్చాడట.
 
అయితే సెట్‌కి వచ్చిన పవన్ ఆ సాంగ్ చూసి షాక్ అయ్యాడట. అంతేకాదు.. పాటకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ పక్కా డ్యాన్స్ కోసం రెడీ అయిపోయాడట. దేవి ఇచ్చిన ట్యూన్స్‌కి తను చాలెంజ్ చేసి మరి అదరగొట్టే స్టెప్పులు వేశాడట. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అనూహ్య స్టెప్పులతో అలరిస్తాడని తెలిసింది. కొరియోగ్రాఫర్‌కి మంచి స్టెప్పులు రెడీ చేయమని కూడా పవన్ చెప్పేశాడట. 
 
సింపుల్‌గా ఉంటూనే ఫ్లోర్ అదిరిపోయే స్టెప్పులతో ఆ సాంగ్ ఉంటుందని సినిమా యూనిట్ అంటోంది. కాగా పవర్ ఫేమ్ బాబీ సర్ధార్ గబ్బర్ సింగ్‌కు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శరథ్ మారర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కాజల్ రొమాన్స్ చేస్తుండగా.. రాయ్ లక్ష్మి ఐటం సాంగ్ నర్తిస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కు పవన్ ఛాలెంజింగ్‌గా అదరగొట్టే స్టెప్పులేస్తే.. ఈ సినిమా తప్పకుండా హిట్టేనని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్పేస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments