Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 11న కమల్ బ్యాక్డ్ విశాల్ టీమ్‌కు ఫిట్టింగ్ రిప్లై ఇస్తా... శరత్ కుమార్

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (13:56 IST)
కోలీవుడ్ నడిగర్ సంఘం హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. విశాల్ వర్సెస్ శరత్ కుమార్ ప్యానెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నడిగర్ సంఘం ఎన్నికలు అక్టోబరు 18న జరుగనున్నాయి. ఈ నేపధ్యంలో నటుడు విశాల్ వర్సెస్ శరత్ కుమార్ ప్యానెల్స్ నువ్వా నేనా అనే రీతిలో ఢీకొంటున్నాయి. ఈ రెండు ప్యానెళ్లకు చెందిన నటులు ఇప్పటికే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ వ్యవహారం తారాస్థాయికి వెళ్లింది. రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ సకలకళా వల్లభుడు అయిన కమలహాసన్ పైన మండిపడ్డారు. కమల్ కృతజ్ఞత లేని వారనీ, చేసిన మేలు మరచిన కృతఘ్నుడంటూ విమర్శించారు.
 
కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రం విడుదల సమయంలో ఇబ్బందులు పడ్డప్పుడు తాను సాయం చేశాననీ, అలాగే ఉత్తమ విలన్ విడుదల సమయంలోనూ తన భార్య రాధికా సాయం చేసినా నడిగర్‌ సంఘం ఎలాంటి సాయం చేయలేదని కమల్ అనడం కృతఘ్నుత కాక ఇంకేమిటి అంటూ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కమలహాసన్ పోటీ జట్టుకు పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని శరత్‌కుమార్ ఆరోపించారు.
 
కాగా విశాల్, శరత్ కుమార్ ప్యానెళ్లు తమతమ మ్యానిఫెస్టోలను విడుదల చేయగా విశాల్ జట్టుకు గెలిచే అవకాశం ఉన్నట్లు ఓ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ సర్వేలో తేలింది. విశాల్ జట్టు 64 శాతం, శరత్ కుమార్ జట్టు 26 శాతం ఓట్లు పడతాయని ఆ సర్వేలో తేలింది. విశాల్ ప్యానల్ మొత్తం 41 పాయింట్లతో ఇచ్చిన మేనిఫెస్టో పట్ల నడిగర్ సంఘంలోని సభ్యులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశాల్ ఆధ్వర్యంలో తమకు న్యాయం జరుగుతుందని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐతే కమల్ హాసన్ వెనకుండి నడిపిస్తున్న విశాల్ ప్యానల్‌కు అక్టోబరు 11న ఫిట్టింగ్ రిప్లై ఇస్తానంటూ శరత్ కుమార్ ప్రకటించారు. మరి ఆ ఫిట్టింగ్ రిప్లై ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments