Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా’ నుంచి సాంగ్ రిలీజ్

డీవీ
గురువారం, 23 మే 2024 (17:48 IST)
Sarangadariya song
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. సినిమాను త్వరలోనే విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తోపాటు, లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా...’ అనే ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే..’ అనే  లిరికల్ సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి.  
 
గురువారం రోజున ఈ మూవీ నుంచి ‘ఎంత అందమో..’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రేయసి ప్రేమ కోసం ఆమె ఇంటి ముందు పడిగాపులు కాసే ప్రేమికుడికి బాధను ఈ పాట‌లో అందంగా వ్య‌క్తం చేశారు.  ఎం. ఎబెనెజర్ పాల్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను క‌డ‌లి స‌త్య‌నారాయ‌ణ రాయ‌గా ధ‌నుంజ‌య్ సీపాన పాడారు.
 
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ ‘‘మా ‘సారంగదరియా’  చిత్రం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేసిన టీజర్‌, రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇప్పుడు ‘ఎంత అందమో’ అనే పాటను విడుదల చేశాం. ఈ మూవీలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. సినిమాను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు.
 
డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి(పండు )మాట్లాడుతూ ‘ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమా త్వ‌ర‌లోనే ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

12 అడుగుల భారీ గిరినాగు.. రక్తపింజరను మింగేసింది.. ఎలా పట్టుకున్నారంటే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments