Webdunia - Bharat's app for daily news and videos

Install App

23న సప్తగిరి ఎక్స్‌‌ప్రెస్‌.. కమెడియన్ హీరోగా మారిన తీసిన చిత్రం

శ్రీ సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ పతాకం పై మాస్టర్స్‌ హోమియోపతి అధినేత డాక్టర్‌ రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌'. ఈ సినిమాతో స్టార్‌ కమెడీయన్‌ సప్తగిరి హీరోగా ఎంట్ర

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (18:22 IST)
శ్రీ సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ పతాకం పై మాస్టర్స్‌ హోమియోపతి అధినేత డాక్టర్‌ రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌'. ఈ సినిమాతో స్టార్‌ కమెడీయన్‌ సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ శిష్యుడు అరుణ్‌ పావర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్‌ బుల్గానిన్‌ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు. ఇటీవలే పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిధిగా 'సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌' ఆడియో విడుదల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. లహరి వారు ఈ చిత్ర ఆడియోను మార్కెట్‌‌లోకి విడుదల చేశారు. 
 
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ కు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. పాటలకి సైతం భారీ రేంజ్‌‌లో రెస్పాన్స్‌ వస్తోందని చిత్ర బృందం తెలిపింది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'యు/ఏ' రేటింగ్‌‌తో 'సప్తగిరి ఎక్స్‌‌ప్రెస్‌' డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకి రాబోతుందని నిర్మాత రవికరణ్‌ అధికారికంగా ప్రకటించారు. కామెడీ అండ్‌ ఎమోషనల్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్‌ : డాక్టర్‌ వాణి రవికరిణ్‌, సినిమాటోగ్రాఫర్‌ : సి.రామ్‌ ప్రసాద్‌, ఎడిటిర్‌ : గౌతంరాజు, ఫైట్స్‌ : స్టంట్స్‌ జాషువా, క్రియేటివ్‌ హెడ్‌ : గోపాల్‌ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య

రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?

'హెచ్.జె.టి-36' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments