Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్'లో కీలక పాత్రలో సంజయ్ దత్?

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:35 IST)
ఇప్పటికే టాలీవుడ్ నటుల కంటే బాలీవుడ్ నటులే ఎక్కువగా కనబడుతున్న జక్కన్న ఆర్ ఆర్ ఆర్‌లో బాలీవుడ్‌కి చెందిన మరో స్టార్ హీరో కనిపించనున్నాడట... వివరాలలోకి వెళ్తే... పలు సంచలనాలకు దారితీస్తున్న టాలీవుడ్ జక్కన్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగు చకచకా సాగుతోంది.


స్వాతంత్య్రం రావడానికి మునుపటి కథ కావడంతో, అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ - రామ్ చరణ్‍‌లు కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్‌ను ఒక కథానాయికగా ఎంచుకోవడం, మరో కీలకమైన పాత్ర కోసం అజయ్ దేవగణ్‌ను ఎంపిక చేసుకున్న విషయాలు తెలిసినవే.
 
ఇక మరో రెండు కీలక పాత్రల కోసం కూడా బాలీవుడ్ హీరోలను తీసుకోనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకుగానూ సంజయ్ దత్‌తోనూ .. షాహిద్ కపూర్‌తోను సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. చారిత్రక నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న కథ కావడంతో, విభిన్నమైన.. విలక్షణమైన పాత్రలు చాలానే వున్నాయట. ఆ పాత్రలకి స్టార్స్‌ను తీసుకోవడం వలన, మార్కెట్ పరంగా మరింత కలిసొస్తుందనే ఆలోచనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

Suitcase: భార్యను కత్తితో పొడిచి.. మృతదేహాన్ని మడతపెట్టి ట్రాలీ బ్యాగులో కుక్కిన టెక్కీ.. ఆపై జంప్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments