Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సందేహం ఫస్ట్ లుక్

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (19:43 IST)
Sandeham first look of Hebba Patel
విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సందేహం. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా.. ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 
 
ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్.. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సినిమా సోల్ తెలిసేలా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో హెబ్బా పటేల్ సీరియస్ లుక్ లో కనిపిస్తుండగా.. బ్యాక్ గ్రౌండ్ లో నాచురల్ లొకేషన్స్, ఇతర ముఖ్య లీడ్ రోల్స్ ని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు. సందేహం అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి 'షి బిలీవ్డ్' అనే ట్యాగ్ లైన్ జోడించారు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే ఈ సందేహంపై జనం కన్ను పడిందని చెప్పుకోవచ్చు.
 
సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్ర పోషిస్తోంది హెబ్బా పటేల్. ఈ రోల్ సినిమాలో మేజర్ అట్రాక్షన్ కానుందట. ఈ చిత్రంలో శ్వేతా వర్మ, రాశిక శెట్టి, శుభ శ్రీ రాయగురు, శ్రీనివాస్ భోగిరెడ్డి, సుందర్ రావు పర్చా, చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా సురేష్ దుర్గం ఎడిటర్ గా పని చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments