Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరా జాస్మిన్ స్థానంలో కీర్తి సురేష్.. పందెంకోడి-2.. హిట్ ఖాయమా?

''మహానటి'' సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు ప్రస్తుతం ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. మహానటికి ముందే అగ్రహీరోలతో కోలీవుడ్‌లో అదరగొట్టిన కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో మాత్రం మహానటికి తర్వాత సినీ అవకాశాల

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (18:29 IST)
''మహానటి'' సినిమాలో నటించిన కీర్తి సురేష్‌కు ప్రస్తుతం ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. మహానటికి ముందే అగ్రహీరోలతో కోలీవుడ్‌లో అదరగొట్టిన కీర్తి సురేష్.. టాలీవుడ్‌లో మాత్రం మహానటికి తర్వాత సినీ అవకాశాలను సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో చియాన్ విక్రమ్ సరసన సామి-2 ( (సామి స్క్వేర్)లో నటిస్తున్న ఈ చిన్నది.. తెలుగులోనూ, తమిళంలోనూ మాస్ హీరోగా క్రేజున్న విశాల్‌ సరసన నటిస్తోంది. 
 
ఇటీవల ఇరుంబు తిరై తమిళనాట ఘనవిజయాన్ని సాధించింది. తెలుగులో అభిమన్యుడు పేరుతో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్‌లోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి తర్వాత విశాల్ పందెంకోడి-2 (తమిళంలో సండైకోళి-2) సినీ షూటింగ్‌లో బిజీబిజీగా వున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో గతంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన పందెం కోడికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌. 
 
ఈ చిత్రాన్ని అన్నీ కార్యక్రమాలు ముగించుకుని దీపావళికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. తమిళనాట దీపావళికి సూర్య, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. అయినా పోటీని లెక్కచేయకుండా విశాల్ పందెం కోడి సీక్వెల్‌ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 
 
ఇక పందెం కోడి-1లో మీరా జాస్మిన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో ప్రస్తుతం కీర్తి సురేష్ నటించనుందని.. విశాల్, కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ అదిరిపోయిందని సినీ పండితులు చెప్తున్నారు. దీంతో సినిమా హిట్ కావడం ఖాయమని వారు జోస్యం చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments