Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికూతురైన "కత్తి" హీరోయిన్ సనాఖాన్

Webdunia
ఆదివారం, 22 నవంబరు 2020 (15:02 IST)
టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం కత్తి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భాన సనా ఖాన్. ఈమె తన అందంతో పాటు.. నటనతో సినీ ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత 'గగనం', 'మిస్టర్ నూకయ్య'ల్లోనూ కనిపించింది. హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించింది. ఈ భామ ఇపుడు ఓ ఇంటికి కోడలైంది. 
 
తాజాగా, గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముఫ్తీ అనాస్ అనే యువకుడిని పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చింది సనా ఖాన్. పెళ్లి దుస్తుల్లో ఉన్న సనా ఖాన్, ముఫ్తీ చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కరోనా మహమ్మారి కారణంగా, కేవలం దగ్గరి కుటుంబీకుల మధ్య సనా వివాహం జరిగినట్టు సమాచారం. ఇక పెళ్లి తర్వాత తాను పూర్తిగా సినిమాలను మానేస్తున్నానని, సినిమాల కోసం తనను సంప్రదించవద్దని ఆమె స్పష్టంచేసింది.
 
కాగా, గత కొన్నేళ్లుగా సినిమాల్లో రాణిస్తూ, ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నానని, ఈ విషయంలో తాను అదృష్టవంతురాలినని వ్యాఖ్యానించిన ఆమె, తనకు పేరు, సంపద, గౌరవాలను సినీ పరిశ్రమ అందించిందని పేర్కొంది. 
 
ఇకపై సినిమా లైఫ్ స్టయిల్‌కు పూర్తి దూరం కావాలని భావిస్తున్నామని, మానవత్వం కోసం పనిచేస్తూ, సేవ చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపింది. కాగా, ఇటీవలే టాలీవుడ్‌కు చెందిన సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments