Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనాథలుగా మారిన బాలికలకు అండగా సంపూర్ణేష్ బాబు.. చదివించేందుకు సిద్ధం!

Webdunia
గురువారం, 1 జులై 2021 (23:32 IST)
Sampoornesh
హీరో సంపూర్ణేష్‌ బాబు అనాథ బాలికలకు అండగా నిలవడం ద్వారా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా, వారిని చదివించేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాలు చేసే హీరో అయినప్పటికీ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు తనకు తోచిన సాయం చేస్తుంటారు సంపూ.
 
తాజాగా దుబ్బాకకు చెందిన నరసింహచారి దంపతులు అప్పు బాధలతో ఆత్మహత్య చేసుకోవడంతో వారి ఇద్దరూ కూమార్తెలు దిక్కులేని వారిగా మారారు. ఈ వార్త చూసి సంపూర్ణేష్‌ చలించిపోయారు. తక్షణమే వారి వివరాలు తెలుసుకుని రూ. 25 వేలు ఆర్థిక సాయం అందించారు. 
 
ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలిపారు. 'దుబ్బాకలో నరసింహాచారి దంపతుల ఆత్మహత్య వార్త విని నా హృదయం కలిచివేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ బిడ్డలకు నేనై, సాయి రాజేశ్‌ రూ. 25వేల? ఆర్థిక సాయం అందించాం. వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను కూడా మేమే చూసుకుంటామని వారికి మాట ఇచ్చాం'' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం సంపూ.. 'బజారు రౌడీ, 'క్యాలీఫ్లవర్‌', 'పుడింగి నంబర్‌ వన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments