Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కులవృత్తి'ని మరచిపోని బర్నింగ్ స్టార్ ... స్వయంగా నగలు తయారీ

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (10:08 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న హీరోల్లో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒకరు. ఈయన "హృదయ కాలేయం" చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై, సినీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. పైగా, మంచి మానవ‌తా దృక్ప‌థం ఉన్న హీరో. సంక్షోభ సమయంలో తనవంతు సాయం చేసేందుకు సర్వదా సిద్ధంగా ఉంటారు.
 
ఇపుడు కరోనా వైరస్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ వల్ల అనేక సినీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ చారిటీ సంపూ రూ.లక్ష రూపాయలు విరాళం అందించారు. అదేసమయంలో ఈ లాక్‌డౌన్ కారణంగా ఆయన తన ఇంటికే పరిమితమై, తన భార్యాపిల్లలతో గడుపుతున్నారు. 
 
అంతేకాదండోయ్.. తన భార్య, పిల్లల కోసం కులవృత్తిని మళ్లీ ప్రారంభించారు. తద్వారా 'బీ ది రియ‌ల్ మ్యాన్' అని నిరూపించాడు. ఇంట్లో మిగిలి పోయిన గజ్జెలతో తన భార్య, పిల్లల కోసం.. మెట్టెలు, గజ్జెలు స్వయంగా చేశాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ప్రపంచానికి తెలియజేశాడు. 
 
ఈ వీడియోను షేర్ చేస్తూ, "రాజు పేద తేడా లేదు... నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు" అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ, మా ఆవిడ కోసం, నా పాత "కంసాలి"వృత్తిని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను అని ట్వీట్‌లో పేర్కొన్నాడు ఈ బర్నింగ్ స్టార్. కాగా, ఈ హీరో చివరగా నటించిన చిత్రం కొబ్బరిమట్ట. 

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments