సమంత సిటాడెల్ యాక్షన్ మోడ్ టీజర్ (video)

సెల్వి
గురువారం, 1 ఆగస్టు 2024 (22:20 IST)
Citadek Teaser
బాలీవుడ్ తారలు వరుణ్ ధావన్, సమంత అమేజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్, సిటాడెల్: హనీ బన్నీ కోసం జతకట్టారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ కథ ఒక ప్రసిద్ధ అమెరికన్ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్‌కు సీక్వెల్‌గా రూపుదిద్దుకోనుంది. తాజాగా సిటాడెల్ టీజర్ రిలీజైంది. 
 
టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో 'రాత్ బాకీ' సాంగ్ ప్లే అవుతోంది. ఇది టోన్‌ను చక్కగా సెట్ చేస్తుంది. విజువల్స్‌లో వచ్చే అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో బాగా మిళితం అవుతుంది. వరుణ్,  సమంతా ఇద్దరూ ఈ సిరీస్‌లో కొన్ని ఉత్కంఠభరితమైన విన్యాసాలు చేశారు. 
 
వారు రొమాంటిక్ కెమిస్ట్రీని కూడా పంచుకున్నట్లు తెలుస్తోంది. సిటాడెల్‌లో కే కే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్ నవంబర్ 7న విడుదల కానుంది. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ తర్వాత ఇది రాజ్, డీకేల మూడవ వెబ్ సిరీస్. ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సమంతతో ఇది వారి రెండవ వెబ్ ప్రాజెక్ట్.
 
ఆ యాక్షన్ అవతార్‌ని పూర్తి స్థాయిలో ఈ సిరీస్‌లో చూడబోతున్నాం. ఎవెంజర్స్: ఎండ్ గేమ్ డైరెక్టర్లు, అమెరికన్ సిటాడెల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు, రస్సో బ్రదర్స్, ఈ భారతీయ స్పిన్-ఆఫ్ కోసం కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లుగా పనిచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1.04 గిగావాట్ హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం రూ. 7,500 కోట్లు మంజూరు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. కుక్కర్ల నుంచి లిక్కర్స్ వరకు.. పిల్లల్నీ వదిలిపెట్టలేదట

Aadudham Andhra: ఆడుదాం ఆంధ్రలో అవకతవకలు.. ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా?

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments