Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకులు తీసుకోవడం చెడు విషయం కాదు : సమంత

Webdunia
గురువారం, 13 జులై 2023 (18:32 IST)
విడాకులు తీసుకోవడం అనేది చెడు విషయం కాదని హీరోయిన్ సమంత అన్నారు. ఆమె నటించిన భారతీయ వెర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె పోస్ట్ చేశారు. 'సిటాడెల్‌ ఇండియా షూట్‌ పూర్తి చేశా. ఏం రానుందో తెలియనప్పుడు బ్రేక్‌ అనేది చెడ్డ విషయంగా మీకు అనిపించదు. రాజ్‌ అండ్‌ డీకే.. నాకు కుటుంబంతో సమానం. ప్రతి ఒక్క సమస్యను ధైర్యంగా పోరాడేందుకు మీరు (రాజ్‌ అండ్‌ డీకే) నాకు ఎంతగానో తోడ్పడ్డారు. అందుకు ధన్యవాదాలు. ప్రపంచంలోని అన్నింటి కంటే ఎక్కువగా మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నా. నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీరు నాకోసం మరో పాత్ర రాసే వరకూ ఇదే నా బెస్ట్‌' అని ఆమె రాసుకొచ్చారు.
 
మరోవైపు, సమంత నటన నుంచి బ్రేక్‌ తీసుకోనుందంటూ ఇటీవలకాలంలో బాగా ప్రచారం జరిగింది. మయోసైటిస్‌తో బాధపడుతోన్న ఆమె.. చికిత్స నిమిత్తం కొన్ని నెలల పాటు విదేశాలకు వెళ్లనున్నారని.. సుమారు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నారని సమాచారం. అందుకే, ‘ఖుషి’, ‘సిటాడెల్‌’ మినహా కొత్త ప్రాజెక్ట్‌లు ఏమీ సామ్‌ ఓకే చేయలేదని టాక్‌. ఈ క్రమంలోనే ఆమె బ్రేక్‌ గురించి తాజాగా పోస్ట్‌ పెట్టడం.. అంతటా వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు.. ఆమె మాట్లాడుతుంది కెరీర్‌ బ్రేక్‌ గురించేనా అని చర్చించుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

జైలుకు వెళ్లినా నా భార్య నాతోనే ఉంటుంది : అఘోరీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments