Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌రోసారి ప‌వ‌న్‌తో స‌మంత‌!

Webdunia
గురువారం, 10 జూన్ 2021 (17:35 IST)
Samantha
స‌మంత అక్కినేని చేసే సినిమాలు భిన్న‌మైన‌విగా ఎంచుకుంటోంది. రొటీన్ త‌ర‌హా పాత్ర‌లు చాలా చేసేశాను అంటూ ఏదైనా ఇంట్రెస్ట్ క‌లిగే క‌థ, పాత్ర వుంటే చాలు చేసేస్తానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ది ఫ్యామిలీ మేన్‌2లో ఆమె చేసిన రాజీ పాత్ర గురించి తెలిసిందే. `ఓబేబీ` సినిమా త‌ర్వాత అలాంటి భిన్న‌మైన పాత్ర‌ను చేయ‌డంలో స్పీడ్ పెంచింది. తాజాగా గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` సినిమా చేస్తోంది. అది పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే యాభైశాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.
 
రామ్‌చ‌ర‌ణ్‌తో `రంగ‌స్థ‌లం` చేసిన ఆమె తాజా స‌మాచారం ప్ర‌కారం ప‌వ‌న్‌క‌ళ్యాన్‌కు జోడిగా మ‌రో సినిమా చేయ‌నున్న‌ద‌ట‌. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా సమంతను తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నార‌ని తెలుస్తోంది. వీరి కాంబినేష‌న్‌లో ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్ర‌క‌ట‌న రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments