Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటమరాయుడుపై కన్నేసిన సమంత.. త్రివిక్రమ్ డైరక్షన్, చైతూతో హీరోయిన్‌గా సమ్మూ?

టాలీవుడ్ సుందరి సమంత ప్రస్తుతం కాటమరాయుడుపై దృష్టి పెట్టింది. తెలంగాణ చేనేత అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సమంత చేనేత కార్మికుల కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న వరంగల్ జ

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (16:53 IST)
టాలీవుడ్ సుందరి సమంత ప్రస్తుతం కాటమరాయుడుపై దృష్టి పెట్టింది. తెలంగాణ చేనేత అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సమంత చేనేత కార్మికుల కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న వరంగల్ జిల్లాలో ఆమె పర్యటించారు. మరోవైపు సేవా కార్యక్రమాలపైనా సమంత దృష్టి పెడుతుంది. ‘ప్రత్యూష ఫౌండేషన్‌’ను నడుపుతున్న సమంత వీలు కుదిరినపుడు ఓ మంచి పని కోసం హీరోలు సినిమాల్లో ధరించిన దుస్తులను, వస్తువులను వేలం వేసి డబ్బులు సంపాదిస్తుంది. అలా వచ్చిన డబ్బును మంచి పనులకు కేటాయిస్తుంది. 
 
ఇదే తరహాలో ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమాలో పవన్‌ ధరించిన దుస్తులను వేలం వేయాలనే ఆలోచనలో ఉందట సమంత. అలా వచ్చిన డబ్బును చేనేత సంక్షేమానికి కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పవన్‌ కూడా చేనేత కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తున్నాడు. కాబట్టి సమంత అడిగితే పవన్‌ కాదనడు. త్వరలోనే పవన్‌ను కలిసి కాటమరాయుడులో ధరించిన దుస్తులను వేలానికి ఇవ్వాల్సిందిగా సమంత కోరనున్నట్లు సమాచారం.
 
మరోవైపు సమంతని త్రివిక్రమ్ శ్రీనివాస్ గోల్డెన్ లెగ్‌గా భావిస్తున్నట్టున్నాడు. తన కొత్త ప్రాజెక్టులో ఆమెను ఎంపిక చేయాలనుకుంటున్నాడు. గతంలో తాను తీసిన మూడు మూవీలు.. అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ.. ఆ ల్లో సమంతే హీరోయిన్. తిరిగి చైతూ, సమ్మూల జోడీతో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్టుకు వెళ్తున్నాడని సమాచారం. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగార్జున దీన్ని పూర్తి రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సమంతను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments