Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samantha : సమంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ లో శుభం చిత్రం

దేవీ
శనివారం, 15 మార్చి 2025 (17:46 IST)
Samantha -Shubham poster
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైన్మెంట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉండనుందని సమాచారం.
 
వసంత్ మరిగంటి రాసిన ఈ కథను సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కిస్తున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి వంటి వారిని సినిమా బండి చిత్రంతో ప్రవీణ్ కండ్రేగుల పరిశ్రమకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.
 
త్రాలాల బ్యానర్ మీద ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమంత అన్నారు. ఈ చిత్రంలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్,శ్రావణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.
 
శుభం చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా మృదుల్ సుజిత్ సేన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా రామ్ చరణ్ తేజ్, ఎడిటర్‌‌గా ధర్మేంద్ర కాకర్లాడ్ వంటి వారు పని చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్లు త్వరలోనే రానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan: హిందీ భాషపై కామెంట్లు.. స్పందించిన డీఎంకే పార్టీ.. ఆ సమయానికి పవన్ పుట్టలేదు

Vadodara car crash: గుంతలున్నాయ్.. కారు అదుపు తప్పింది.. అందుకే ప్రమాదం..

మహా కుంభమేళా పింటు.. రూ.12.8 కోట్ల పన్నులు చెల్లించాలని ఆదేశాలు

Prakash Raj: ఎవరైనా దీన్ని పవన్ కళ్యాణ్‌‌కి చెప్పండి ప్లీజ్

వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి: ఆరేళ్లు గడిచినా న్యాయం జరగలేదు.. సునీత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments