Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్గిల్ విజయ్ దివస్: హీరోలకు సెల్యూట్ చేద్దామంటూ సమంత ట్వీట్.. చేనేత చీర కట్టుకుని?

పాకిస్థాన్‌తో మే-1999 నుంచి జూలై-1999 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసింది. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన నేషనల్ హ

Webdunia
గురువారం, 27 జులై 2017 (11:30 IST)
పాకిస్థాన్‌తో మే-1999 నుంచి జూలై-1999 వరకు కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది. జూలై 26వ తేదీన కార్గిల్ యుద్ధం ముగిసింది. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మన నేషనల్ హీరోస్‌కు శాల్యూట్ చేద్దామంటూ ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున కాబోయే కోడలు సమంత పేర్కొంది. బుధవారం కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. నాడు కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన భారత ఆర్మీ, త్రివర్ణ పతాకంతో పాటు రూపొందించిన ఓ పోస్టర్‌ను సమంత పోస్ట్ చేసింది. ‘కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్లకు ప్రణామాలు చేస్తున్నట్లు సమంత పేర్కొంది. 
 
మరోవైపు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. రెండు రోజుల క్రితం సమంత ట్విట్టర్‌లో తన తల్లి చీర కట్టుకుని దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ చేనేతపై యువతులకు పోటీ పెట్టి బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. యువతులు తమ తల్లి ధరించే చేనేత చీరను ఫ్యాషన్‌బుల్‌గా కట్టుకుని ఫొటో దిగి దానికి రివైవ్ హ్యాండ్‌లూమ్, వోవెన్ 2017 అనే పదాలను హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని సూచించింది.
 
ఈ ఫోటోల్లో ఐదుగురిని సెలెక్ట్ చేసి వోవెన్ ఫ్యాషన్ షోకు ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. సమంత ట్వీట్ యువతులు పెద్ద ఎత్తున చేనేత చీరలను కట్టుకుని.. ఆ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments