Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకైనా బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సమంత సొంత కష్టంతో పైకొచ్చింది.. పెళ్ళికి తర్వాత సినిమాలు ఆపేయదు..

ఇన్నాళ్లూ ప్రేమ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచిన నాగ చైత‌న్య‌, స‌మంత‌లు ''యస్‌… తాము ప్రేమించుకొంటున్నాం, పెళ్లి కూడా చేసుకొంటున్నాం'' అని బ‌హిరంగంగా చెబుతున్నారు. అయితే పెళ్లెప్పుడు అనేది మాత్రం దాచేస్తున

Webdunia
మంగళవారం, 4 అక్టోబరు 2016 (17:30 IST)
ఇన్నాళ్లూ ప్రేమ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచిన నాగ చైత‌న్య‌, స‌మంత‌లు ''యస్‌… తాము ప్రేమించుకొంటున్నాం, పెళ్లి కూడా చేసుకొంటున్నాం'' అని బ‌హిరంగంగా చెబుతున్నారు. అయితే పెళ్లెప్పుడు అనేది మాత్రం దాచేస్తున్నారు. స‌మంత రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ''మా తల్లిదండ్రులకి కూడా మేం ఎప్పుడు పెళ్లి చేసుకొంటున్నామ‌న్న‌ది మూడు నెల‌ల ముందే తెలుస్తుంది. ఇక మీడియాకి ఎందుకు ముందే చెప్పాలి?'' అంది. తానూ, చైతూలు తొలి సినిమా నుంచే మంచి ఫ్రెండ్స్‌మ‌నీ, ప్ర‌స్తుతం డేటింగ్‌లో ఉన్నామ‌ని ఆమె సెల‌విచ్చింది. 
 
కాగా అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కొత్త సినిమా ''ప్రేమమ్‌''ను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను యూనిట్ సభ్యులు వేగవంతం చేశారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాగ చైతన్య తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది తమ పెళ్ళి ఉంటుందని, ఇంకా డేట్ ఏదీ ఫిక్స్ చేసుకోలేదని అన్నారు. 
 
ఇక పెళ్ళి తర్వాత సమంత సినిమాలు మానేస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ''నేనైనా రెండు కుటుంబాల సపోర్ట్‌తో హీరోగా ఈ స్థాయికొచ్చాను. సమంత తన సొంత కష్టంతో ఈ స్థాయికి వచ్చింది. అలాంటి వ్యక్తిని పెళ్ళి కాగానే సినిమాలు ఆపేయమని ఎవ్వరూ అనరనే అనుకుంటా. స్వతహాగా నాకైతే పెళ్ళి తర్వాత తను సినిమాలు మానేయాలన్న ఆలోచన అస్సలు లేదు'' అని స్పష్టం చేశారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments