Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రంగస్థలం 1985": సమంత లుక్ ఇదే.. విలేజ్ అమ్మాయిగా.. మేకప్ లేకుండా?

రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంత నటిస్తోంది. ఇందులో సమంత లుక్ సంబంధించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రంగస్థలం 198

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (11:12 IST)
రంగస్థలం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రామ్‌చరణ్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సమంత నటిస్తోంది. ఇందులో సమంత లుక్ సంబంధించిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రంగస్థలం 1985’ పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో సమంత విలేజ్ అమ్మాయిగా ఆకట్టుకోనుంది. గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత ఈ చిత్రంలో మేకప్ లేకుండా సాధారణ గ్రామీణ మహిళగా కనిపిస్తోంది. 
 
మరోవైపు చరణ్‌ క్యారెక్టర్‌ లుక్స్‌ కూడా ఆకట్టుకుంటున్నాయి. సహజత్వానికి దగ్గరగా ఈ పాత్రలు వుంటాయి. గోదావరి తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరిపారు. చరణ్‌ కెరీర్‌లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా మారనుందని సినీ పండితులు ఇప్పుడే జోస్యం చెప్పేశారు. 
 
దర్శకుడిగా సుకుమార్‌పై ఉన్న నమ్మకం వల్ల ప్రీ బిజినెస్‌ క్రేజీగా జరుగుతోంది. కేవలం డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల ద్వారా 25 కోట్లు వచ్చాయని ట్రేడ్‌ వర్గాల సమాచారం. ఇకపోతే.. ఈ సినిమాలో చెర్రీ ఓ థియేటర్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. స్వతహాగా థియేటర్ ఆర్ట్స్‌పై ఆసక్తిగల ఆర్టిస్ట్ అయిన ఓ యువకుడు తాను సొంతంగా స్థాపించిన కంపెనీకి పెట్టుకున్న పేరే ఈ రంగస్థలం 1985 అని సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

సంకీర్ణ ప్రభుత్వంపై చిందులేసిన ఆర్కే రోజా.. తదుపరి ప్రభుత్వం మాదే

అల్లు అర్జున్‌పై ఎలాంటి కోపం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

ఫీలింగ్స్ సాంగ్ చేయడం రష్మికకు ఏమాత్రం ఇష్టం లేదు : సీపీఐ నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

తర్వాతి కథనం
Show comments