Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతూ.. ప్లీజ్, నన్ను వెళ్లనివ్వొద్దు.. నా విమానం టేకాఫ్‌ అవుతుందా? అంటున్న సమంత

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశిలో షెడ్యూల్‌కు ఆమె వెళ్లాల్సి ఉంది. అయితే, నెల రోజుల పాటు అంతదూరం వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టంలేని

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (12:54 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌కాశిలో షెడ్యూల్‌కు ఆమె వెళ్లాల్సి ఉంది. అయితే, నెల రోజుల పాటు అంతదూరం వెళ్లేందుకు ఏమాత్రం ఇష్టంలేని సమంత... సోషల్ మీడియా వేదికగా చేసుకుని మూడు ప్రశ్నలను సంధించింది.
 
ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్‌ కోసం వెళ్లటానికి ముందు.. అసలు నేనెందుకు వెళ్లాలో మూడు కారణాలు చెప్పండి? అంటూ నాగచైతన్యనో లేక ఆ సినిమా నిర్మాతనో కానీ ఆసక్తికర ప్రశ్నలు వేసి... చైకి దూరంగా వెళ్లడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఆమె వేసిన ప్రశ్నలు ఏంటంటే... 1) వర్షం పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతున్న వేళ షూటింగ్ జరుగుతుందా? 2) ఒక వేళ నేను అనారోగ్యానికి గురవుతానేమో? 3) అసలు నా విమానం టేకాఫ్‌ అవుతుందా? అని ప్రశ్నించింది. చైతన వెళ్లాల్సిందే అన్నట్టున్నాడు. అందుకే... ప్లీజ్‌ నన్ను వెళ్లనివ్వొద్దు అంటూ వేడుకుంది. 
 
కాగా, వచ్చే అక్టోబరు నెల ఆరో తేదీన హిందూ క్రైస్తవ పద్దతుల్లో సమంత, నాగ చైతన్యలు ఒక్కటి కానున్న విషయం తెల్సిందే. వీరిద్దరి వివాహం గోవాలో జరుగనుంది. తమ ప్రేమానుబంధాలను సోషల్ మీడియాలో పలు సందర్భాల్లో సమంత వ్యక్తం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చైతూని విడిచి వెళ్లలేక... తన గోడు సోషల్ మీడియాలో వెల్లబోసుకుంది. దీనికి నిదర్శనంగా నాగచైతన్య గుండెలపై నిద్రిస్తున్న ఫోటోను ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో షేర్‌ చేసింది. ఈ పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా టీకాలు వేయించుకోవడంతో ఆ శక్తి తగ్గిపోయిందా?

'థగ్ లైఫ్' చిత్ర ప్రదర్శనను అడ్డుకోండి : కర్నాటక మంత్రి పిలుపు

ఆమె చిన్నపిల్ల కాదు కదా, 40 ఏళ్ల మహిళ 23 ఏళ్ల వాడితో అన్నిసార్లు ఎందుకు వెళ్లింది?

లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. గుండెపోటుతో తండ్రి మృతి

టీడీపీ అధ్యక్షుడుగా నారా చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments