Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు పువ్వులంటే ఎలర్జీ... చేతులపై దద్దుర్లు వచ్చాయ్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (14:33 IST)
శాకుంతలంలో సమంత శకుంతల పాత్రలో కనిపించనుంది. మలయాళ హీరో దేవ్ మోహన్ దుశ్యంత్ పాత్రలో సమంత సరసన నటిస్తున్నారు. సమంత రూత్ ప్రభు తన కెరీర్‌లో తొలిసారి ఓ పౌరాణిక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
పీరియాడికల్ డ్రామా ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకుడు. ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది. శకుంతలం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం శకుంతల పాత్రలో నటిస్తున్న సమంత ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. 
 
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని విషయాలను వివరించింది. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో, సమంతా కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. సమంతకు పువ్వులంటే ఎలర్జీ. ఆ సినిమాలో తాను వేసుకున్న పువ్వుల వల్ల తన చేతులపై దద్దుర్లు వచ్చాయని, అది పూల పచ్చబొట్టులా ఉందని చెప్పింది. ఆరు నెలల పాటు అక్కడే ఉండిపోయిందని, షూటింగ్ సమయంలో దాచుకోవడానికి మేకప్ వేసుకున్నానని చెప్పింది. 
 
ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ.. ''శకుంతల పాత్ర నేటితరం అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. శకుంతల పాత్ర పోషించడం నటిగా నాకు పెద్ద బాధ్యత. అంతకుముందు నేను భయపడ్డాను. అందుకే గుణశేఖర్ అడగ్గానే నో చెప్పాను. నేను ఇందులో రాజీ పాత్రలో నటించాను. శకుంతల ఇప్పుడు తన పాత్రలో చాలా అందంగా కనిపించాలి. ప్రతి ఫ్రేమ్‌లోనూ అందంతో కూడిన పాత్రలో ఒక డిగ్నిటీ- గ్రేస్ కనిపించాలి. పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నాను. దానికి కారణం నా నటన పట్ల దర్శకుడు, నిర్మాత సంతృప్తి చెందడమే.. అని చెప్పింది. 

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments