Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమాయకపు భర్తను ఎందుకు మోసం చేశారు.. సమంత కూల్ రిప్లై

సెల్వి
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (20:28 IST)
అక్కినేని నాగచైతన్య ,సమంత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఎంతో అన్యోన్యంగా సాగిన వారి కాపురం అనూహ్యంగా విడాకులకు దారి తీసింది. విడాకులకు కారణం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్సే. వీళ్లు విడిపోయి సంవత్సరాలు గడుస్తున్నా.. వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం ఆగట్లేదు. 
 
విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి కెరీర్‌లో వాళ్లు బిజీగా వున్నారు. తాజాగా ఓ నెటిజన్ చైతూకు సపోర్ట్ చేస్తూ సమంతను ఓ ప్రశ్న అడిగాడు. అందుకు సమంత కూల్‌గా ఘాటుగా రిప్లై ఇచ్చింది. మీ అమాయకపు భర్తను మీరు ఎందుకని మోసం చేశారు..? అంటూ ఓ నేటిజన్ ప్రశ్నించాడు. ఇందుకు సమంత ఇలా బదులిచ్చింది. 
 
"సార్ ఇలాంటి ప్రశ్నలు వేయడం ద్వారా మీకు ఎటువంటి సహాయం కలగదు.. మీకు అంతా మంచి జరగాలి అని కోరుకుంటున్నాను.. అలాగే మీరు జీవితంలో బలంగా మారాలి అని ఆశిస్తున్నాను. ఇలా ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి" అంటూ సమాధానం ఇచ్చింది. 
 
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో మరొకసారి సమంత-చైతన్య విడాకుల గురించి చర్చలు జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

పవన్ కల్యాణ్ సినిమాలను వదులుకుంటారా? మెగా డాటర్ రెస్పాన్స్

పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు : విద్యా మంత్రి లోకేశ్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments