Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారుల జీవితాలను ‘శబ్ధమయం’ చేసేందుకు ముందుకొచ్చిన సమంత

మనిషికి గల ఇంద్రియాల్లో చెవులు అత్యంత ముఖ్యమైనవి. చెవులు మెదడుకు ‘గేట్ వే’ లాంటివి. ఒక పసి కూన స్కూల్‌కి వెళ్లి, టీచర్లు చెప్పేది అర్ధం చేసుకోవాలంటే… అప్పటికే ఆ బిడ్డకు సుమారుగా నాలుగున్నర కోట్ల (నాలుగున్నర మిలియన్లు) పదాలు చెవిన పడి ఉండాలి. అంటే ప్ర

Webdunia
శనివారం, 14 జులై 2018 (21:32 IST)
మనిషికి గల ఇంద్రియాల్లో చెవులు అత్యంత ముఖ్యమైనవి. చెవులు మెదడుకు ‘గేట్ వే’ లాంటివి. ఒక పసి కూన స్కూల్‌కి వెళ్లి, టీచర్లు చెప్పేది అర్ధం చేసుకోవాలంటే… అప్పటికే ఆ బిడ్డకు సుమారుగా నాలుగున్నర కోట్ల (నాలుగున్నర మిలియన్లు) పదాలు చెవిన పడి ఉండాలి. అంటే ప్రతి రోజూ సుమారు 30 వేల పదాలు వింటూ ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో.. ఒకవేళ పిల్లల్లో వినికిడిపరంగా సమస్యలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి? పూర్తిగానే కాదు.. పాక్షికంగా వినికిడిపరమైన సమస్య ఉండి, దానిని సకాలంలో గుర్తించకపోతే.. అది వాళ్ళ బంగారు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుంది.
 
ఈ సున్నితమైన, అత్యంత తీవ్రమైన సమస్యపై ‘ఫోనాక్’ అనే సంస్థ ‘లైఫ్ ఈజ్ ఆన్’ అనే స్లోగన్‌తో.. గత 70 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్నది. ఈ అంశంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడానికి అవిరళ కృషి సలుపుతోంది. దీనిపై శాస్త్రీయమైన పరిశోధనలు సైతం చేపడుతున్నది. ఇప్పుడు ఈ సంస్థ ‘ఏయూఎమ్’ (ఏ యూనిట్ ఆఫ్ హియరింగ్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్)తో కలిసి పనిచేస్తూ.. వినికిడి లోపం గుర్తించే ఉచిత శిబిరాలు విస్తృతంగా నిర్వహిస్తోంది.
 
ఏపీ, తెలంగాణాలో 36 శాఖలు కలిగిన ఈ సంస్థను స్వయంగా ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న మానవతావాది, ప్రఖ్యాత కథానాయకి సమంత అక్కినేని సందర్శించి.. వినికిడి లోపంతో బాధపడుతున్న పదిమంది చిన్నారులకు వినికిడి యంత్రాలు అందించారు. ఈ సంస్థకు ముందుముందు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా సమంత పేర్కొన్నారు. సమంత నటించగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘రంగస్థలం’లో హీరో రామ్ చరణ్ వినికిడి లోపం కలిగిన ‘సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు’గా నటించి ఉండటం విశేషం. ఈ కార్యక్రమంలో ‘హియరింగ్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్’ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.రాజా, ఫోనాక్ ప్రతినిధి స్నేహా మాయేకర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments