Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెర్బియాలో రాష్ట్రపతిని కలిసిన సిటాడెల్ టీమ్

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2023 (12:09 IST)
Citadel Team
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ ఇటీవల సెర్బియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసే అవకాశం వచ్చింది. నటీనటులు, సిటాడెల్ ఇండియా డైరెక్టర్లు, రాజ్ అండ్ డికె అని కూడా పిలువబడే రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 
 
రాష్ట్రపతిని కలిసినందుకు వరుణ్ ధావన్ తన ఆనందాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమంత, సిటాడెల్ ఇండియా టీమ్ అధికారిక దుస్తులు ధరించారు. సిటాడెల్ ఇండియా టీమ్ ప్రస్తుతం సెర్బియాలో ఒక లెగ్ ఆఫ్ సిరీస్ షూటింగ్ కోసం ఉంది. 
 
వరుణ్ ఇంతకుముందు షెడ్యూల్‌ను ధృవీకరించాడు. భారతదేశంలో ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా ఈ సిరీస్ గేమ్ ఛేంజర్‌గా మారబోతోందని వరుణ్ పేర్కొన్నాడు. సమంత - వరుణ్ లండన్‌లో జరిగిన సిటాడెల్ గ్లోబల్ ప్రీమియర్‌కు ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్, స్టాన్లీ టుచీ లెస్లీ మాన్‌విల్లేతో కలిసి హాజరయ్యారు. 
 
సిటాడెల్ ఇండియా అనేది అసలు సిటాడెల్ సిరీస్ స్పిన్-ఆఫ్. దీనిని ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ నిర్మించారు. ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఇండియన్ చాప్టర్ ఆఫ్ సిటాడెల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో సెర్బియాలో సిటాడెల్ టీమ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

IMD News: హైదరాబాద్-తెలంగాణ జిల్లాలకు గుడ్ న్యూస్.. ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయట

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments