Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పై కెమెరాలపై మెహ్రీన్, సమంత ఏమన్నారు.. సమ్మూ ఫ్యాన్స్‌కు పండగే..?

రాజుగారి గది 2 సినిమా తర్వాత అక్కినేని నాగార్జున కోడలు సమంత నటించే సినిమాలు వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ కానున్నాయి. తెలుగు, తమిళభాషల్లో సమంత నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. తమిళంలో

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (14:21 IST)
రాజుగారి గది 2 సినిమా తర్వాత అక్కినేని నాగార్జున కోడలు సమంత నటించే సినిమాలు వచ్చే ఏడాది వరుసగా రిలీజ్ కానున్నాయి. తెలుగు, తమిళభాషల్లో సమంత నటించిన మూడు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. తమిళంలో సమంత చేసిన 'ఇరుంబుదురై' జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయాలనే ఆలోచనలో వుంది సినీ యూనిట్. 
 
ఇక తెలుగులో సమంత నటిస్తున్న మహానటి సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేగాకుండా మహానటి విడుదలైన మరుసటి రోజే అంటే మార్చి 30వ ''రంగస్థలం'' విడుదల కానుంది. ఇలా సమంత వరుస సినిమాలతో ప్రేక్షకులకు ట్రీట్ ఇవ్వనుంది. 'మహానటి'లో ప్రధానపాత్ర కాకపోయినా.. కీలకపాత్రే. ఇక  హీరోయిన్‌గా చేస్తున్న ఇరుంబుదురై, రంగస్థలం సినిమాలు సమంతా ఖాతాలో హిట్‌ను సంపాదించిపెడతాయని సినీ  పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. స్పై కెమెరాల నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సినీనటి సనా అన్నారు. మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న రహస్య కెమెరాలు విచ్చలవిడిగా అమ్మకుండా చూడాలని ఆమె కోరారు. ఆన్‌లైన్‌లో స్పై కెమెరాలు కేవలం రూ.250కే దొరకటం విచారకరమన్నారు. స్పై కెమెరాల వల్ల కలిగే అనర్థాలపై నటీమణులు సమంత, మెహ్రీన్‌లు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారని, రహస్య కెమెరాల నియంత్రణ కోసం వారు పోరాడేందుకు సిద్ధమయ్యారని సనా చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments