Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక నాలో చాదస్తం మరింత ఎక్కువైంది.. 'యూ టర్న్‌' సమంత

అక్కినేని నాగచైతన్యను అక్టోబర్‌లో పెళ్లాడిన అందాల రాశి సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో పెళ్లికి తర్వా తన స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పుకొచ్చ

Webdunia
బుధవారం, 13 డిశెంబరు 2017 (12:35 IST)
అక్కినేని నాగచైతన్యను అక్టోబర్‌లో పెళ్లాడిన అందాల రాశి సమంత ప్రస్తుతం రంగస్థలం సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా వుంది. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తన స్వేచ్ఛను కోల్పోవాల్సిన అవసరం తనకు రాలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. పెళ్లాడిన తర్వాత చాదస్తం బాగా పెరిగిపోయిందని వెల్లడించింది.
 
పెళ్లాడాక కొత్తగా తనలో ఎలాంటి మార్పులు రాకపోయినా.. మొదటి నుంచి తనలో వున్న చాదస్తం మరింతగా  పెరిగిందని చెప్పుకొచ్చింది. ఏదైనా కథ వింటే తప్పులు వెదికే వైఖరి పెరిగిపోయిందని అంది. పెళ్లి కాకముందు కాస్త నచ్చని కథలు తన ముందుకు వచ్చినప్పుడు, వాటి గురించి మరింత లోతుగా విశ్లేషణ చేస్తున్నానని సమంత తెలిపింది. మంచి సినిమాలు చేతిలో ఉండటం వల్లే నచ్చని కథలను అలా వదిలేస్తున్నానని తెలిపింది. 
 
ఇదిలావుంటే సమంత నిర్మాతగా మారనున్నారు. గతంలో అనుకున్నట్టుగానే కన్నడలో సూపర్ హిట్ అయిన చిత్రం 'యు టర్న్'తోనే నిర్మాతగా మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి నిర్మాణం విషయంలో మామయ్య నాగ్ సలహాలు కూడా ఆమె తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
కన్నడలో లూసియా చిత్రం ఫేం పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెద్ద స్టార్స్ ఎవరూ నటించలేదు. అయినా మౌత్ టాక్‌తో మంచి వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నిర్మాతగా బాధ్యతలు చేపడుతూనే.. నటించనుందని టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments