బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన చిత్రం కిక్. ఈ చిత్రం అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. నిజానికి జాక్వెలిన్ మొదటి సినిమానే సల్మాన్‌తో నటించే ఛాన్స
బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ జంటగా నటించిన చిత్రం కిక్. ఈ చిత్రం అభిమానులకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. నిజానికి జాక్వెలిన్ మొదటి సినిమానే సల్మాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇపుడు 'జుద్వా 2'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈమె సిద్ధమవుతోంది. సల్మాన్ నటించిన సూపర్‌హిట్ మూవీ 'జుద్వా'కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇపుడు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసే పనిలో సల్లూభాయ్ నిమగ్నమైపోయాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా సల్మాన్, జాక్వెలిన్‌తో కలిసి 'జుద్వా' మూవీలోని టన్ టనా టన్ సాంగ్‌కు డ్యాన్స్ చేసి సందడి చేశాడు. సల్మాన్, జాక్వెలిన్ డ్యాన్స్ వీడియోలో ఇపుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. వరుణ్ ధావన్, జాక్వెలిన్ కాంబినేషన్‌లో వస్తున్న 'జుద్వా 2' ఈ నెల 29న విడుదల కానుంది.